మేము తిట్టిస్తే దారుణంగా ఉంటుంది : కొడాలి నాని

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని తీవ్రమైన పదజాలంతో దూషించారు. చంద్రబాబు, ఆయన భజన బృందంతో తమను, తమ నేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇష్టం వచ్చినట్లు తిడితే సహించేది…

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని తీవ్రమైన పదజాలంతో దూషించారు. చంద్రబాబు, ఆయన భజన బృందంతో తమను, తమ నేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇష్టం వచ్చినట్లు తిడితే సహించేది లేదని అంటూ ఆయన తీవ్ర పదాలను ఉపయోగించి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని రాజధానిలో తిరుగుతారని ఆయన అన్నారు. ఇకనైనా చంద్రబాబు రాజధానిలో డ్రామాలు కట్టిపెట్టాలని అన్నారు.

చంద్రబాబు వ్యక్తిగతంగా నన్ను, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను దూషిస్తున్నారు. బాబు నోటికొచ్చినట్టు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తా’మని మంత్రి హెచ్చరించారు.

“మంగళగిరి, తాడికొండలలో టీడీపీ ఓడిపోయినా చంద్రబాబుకి సిగ్గు లేదు. పైగా మాపైకి కుక్కలను పంపి తిట్టిస్తున్నారు. తాము చంద్రబాబు భార్య, తల్లి, అక్కపై విమర్శలు చేయలేదు. కానీ చంద్రబాబు తమ కుటుంబ సభ్యులపై విమర్శలు చేయిస్తున్నారు. మేము తిట్టిస్తే ఇంతకన్నా దారుణంగా ఉంటుందని”, ఆయన హెచ్చరించారు.