ఫైర్ బ్రాండ్ కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరశిస్తున్న బాలకృష్ణ, పురందేశ్వరిపై విరుచుకుపడ్డారు. బాలయ్యకు బొచ్చు లేదని, పురందీశ్వరికి బ్రెయిన్ లేదని అన్నారు నాని.
“చంద్రబాబు ఎఫ్ఐఆర్ లో లేనిది ఎక్కడ. ఎక్కడ చూసినా ఆయనే ఉన్నాడు. చంద్రబాబు అవినీతిచక్రవర్తి అని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు. బాలయ్య, పురందేశ్వరి మాత్రం చంద్రబాబును వెనకేసుకొస్తారు. బాలకృష్ణ బొచ్చులెస్.. పురందేశ్వరి బ్రెయిన్ లెస్. ఎన్టీఆర్ కడుపున పుట్టిన వీళ్లకి సిగ్గులేదు. చంద్రబాబు 420 అని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు. అలాంటి చంద్రబాబును బాలకృష్ణ, పురందేశ్వరి వెనకేసుకొస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఎన్టీఆర్ పరువు తీయడానికే పుట్టారు. పదవులు, డబ్బు కోసం పురందేశ్వరి, బాలకృష్ణ కలిసి ఎన్టీఆర్ ను మోసం చేశారు.”
చంద్రబాబును వెనకేసుకొస్తున్న బాలకృష్ణకు ప్రత్యేకంగా చాకిరేవు పెట్టారు కొడాలి నాని. బాలకృష్ణకు నిజంగా బ్రెయిన్ ఉంటే, చంద్రబాబును సమర్థించరని అన్నారు.
“బాలయ్య ఆల్రెడీ బొచ్చు లెస్ అనే విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు బ్రెయిన్ లెస్ అని కూడా అనిపించుకున్నాడు. లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ ను చదవడమే బాలకృష్ణ పని. బాలకృష్ణ నిత్యం ఎవరిదో బొచ్చు పైన పెట్టుకొని తిరుగుతుంటాడు. కనీసం బ్రెయిన్ అయినా ఆయనది వాడితే బాగుంటుంది. ఎవరో రాసిచ్చింది చదువుతున్నాడు.”
ఇక చంద్రబాబు, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ను ఒకే కుటుంబ సభ్యులుగా చెప్పుకొచ్చారు నాని. కేవలం తన స్వలాభం కోసం పవన్ కల్యాణ్ చేత, చంద్రబాబు పార్టీ పెట్టించారని, టీడీపీకి వత్తాసు పలకడానికి తప్ప పవన్ కల్యాణ్ ఎందుకూ పనికిరారని అన్నారు.