టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెక్కివెక్కి ఏడ్వడంపై రచ్చ సాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు వైరి వర్గాలుగా విడిపోయి పరస్పరం తిట్టిపోసుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ జుగుప్సాకరంగా తయారయ్యాయి. న్యూస్ చానళ్లు చూడాలన్నా భయపడే పరిస్థితి. ఇక పత్రికలు ముట్టుకోవాలంటే… ఎలాంటి దూషణలు చదవాల్సి వస్తుందననే ఆందోళన.
ఈ నేపథ్యంలో అసెంబ్లీలో వేదికగా చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురి కావడం, అనంతరం బహిష్కరించడం తీవ్ర చర్చనీయాంశమైంది. చంద్రబాబు ఏడ్వడంపై సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ సంచలన ట్వీట్ చేశారు. బాబును తనదైన వ్యంగ్యంతో వర్మ దెప్పి పొడిచాడు.
“ఏడ్చే మగవాణ్ణి, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని ఎవరో పూర్వీకులు చెప్పారని నేను ఎప్పుడో విన్నాను…కానీ నేను నవ్వే ఆడదాన్ని ఇష్టపడతాను. ఎందుకంటే చూడటానికి బాగుంటుంది కాబట్టి. కానీ బలం, ధైర్యం చూపించాల్సిన మగాడు పబ్లిక్ లో ఏడిస్తే జాలి కాదు, జుగుప్స పుడుతుంది” అని వెటకరించాడు. వర్మ ఏడ్పు జుగుప్స కలిగిస్తోందని వర్మ తేల్చి చెప్పాడు.
వర్మ ట్వీట్‌పై మిశ్రమ కామెంట్స్‌పై రావడాన్ని గమనించొచ్చు. “చెల్లికీ, చెలికీ పెద్ద తేడా చూడని, చూసినా పట్టించుకోని నీలాంటోడికి ,కుటుంబం విలువలు తెలియని నీలాంటోడికి ఏం తెలుస్తుంది భార్య విలువ” అంటూ ఓ నెటిజన్ తన ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. కొందరు నెటిజన్లు సమర్థిస్తూ కామెంట్స్ చేశారు.