పార్టీలు వేరు. కానీ ఇద్దరూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ప్రత్యర్థిగా కంటే శత్రువుగా భావిస్తారు. అక్కడే వాళ్లద్దరి భావాలు కలిశాయి. ఒకే మాట, ఒకే బాట అన్నట్టు రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు. దీంతో ఇద్దరూ ఒకేసారి ఒకే రకమైన డిమాండ్ చేయడం యాదృచ్ఛికమైనా…ఆశ్చర్యం కలిగించాయి.
గతంలో సీబీఐ తమ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదంటూ ఏకంగా జీవో తీసుకొచ్చిన కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన నాయకుడు…ఇప్పుడు సీబీఐ డిమాండ్ చేయడమే విచిత్రంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఇద్దరు నాయకులు జనసేనాని పవన్‌కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.
అంతర్వేది ఆలయ రథం దగ్ధం కావడం రాజకీయ రంగు పులుముకొంది. జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించడానికి, ఇరుకున పెట్టడానికి ఇదే అదనుగా భావించిన జనసేనాని పవన్‌కల్యాణ్ యుద్ధ ప్రాతిపదికపై స్పందించారు. ఏకంగా సీబీఐ, ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టాలని కేంద్రాన్ని కోరుతానని ఆయన అంటున్నారు. అంతర్వేది ఘటనపై పవన్ ఏమంటున్నారంటే…
“ఆలయాల్లో రథాలు కాలిపోతున్నా , విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా ఎవరో మతిస్థిమితం లేని వ్యక్తులు చేస్తున్నారని చెబుతుంటే బడికెళ్లే చిన్న పిల్లలు కూడా నవ్వుతున్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఇలా జరుగుతుంటే ఏమనుకోవా? దేవాలయాలపై దాడులు పకడ్బందీ కారణాలతో సాగుతున్నాయా అనే కోణంలో మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. ఆ మేరకు సరైన చర్యలు తీసుకోకపోతే సీబీఐ దర్యాప్తు కోసం, ఉగ్రవాద కోణం ఉందనిపిస్తే ఎన్ఐఏ సాయం అందిం చాలని కేంద్రాన్ని కోరుతాం” అని పవన్ అన్నారు.
ఇదే విషయమై లోకేశ్ డిమాండ్ ఏంటో చూద్దాం. “అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి” అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ డిమాండ్ చేశారు.
ఓకే…వీళ్లిద్దరూ కోరినట్టు సీబీఐ డిమాండ్ చేయాలనే నిర్ణయాన్ని అందరూ స్వాగతిద్దాం. మరి పుష్కర ఘాట్‌లో చంద్రబాబు ప్రచార పిచ్చితో 29 మంది చనిపోయినప్పుడు హిందువుల మనోభావాలు, కుట్ర కోణాలు పవన్‌కల్యాణ్, లోకేశ్‌లకు కనిపించలేదా? అప్పుడు వీళ్లిద్దరూ ఎక్కడ నిద్రపోతున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే నిన్నగాక మొన్న విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో పది మంది ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు ఈ నాయకులిద్దరూ ఏ కలుగులో దాక్కున్నారో చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
బాధ్యత గల ప్రతిపక్ష పార్టీలుగా బాధితులను ఓదార్చి, జీవితాలపై భరోసా కల్పించాల్సిన నాయకులు….షూటింగ్‌ల్లో ఒకరు, ట్విటర్‌లో మరో నేత బిజీగా గడిపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం డాక్టర్ రమేశ్ కమ్మ సామాజిక వర్గంతో పాటు తమ పార్టీ నాయకుడు కావడం వల్లే లోకేశ్ నోరు మెదపలేదనే విషయం అందరికీ తెలిసిందే. ఇక టీడీపీకి పరోక్షంగా పవన్ వంత పాడడం కూడా తెలిసిందే.
స్వర్ణ ప్యాలెస్ దుర్ఘటనకు బాధ్యులపై కేసులు వద్దని, ఇప్పుడు మాత్రం సీబీఐ, ఎన్ఐఏ దర్యాప్తులు కావాలని కోరడంలో..పవన్, లోకేశ్ పచ్చపాత బుద్ధి బయటపడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.