బీజేపీ ఐటీ సెల్‌లో వెధ‌వ‌లంటున్న సొంత పార్టీ నేత

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి వివాదాల‌కు మారుపేరు. ఆయ‌న‌కు కోపం వ‌చ్చిందంటే…త‌న మ‌న అనే తేడా ఉండ‌దు. త‌న‌ను ఇబ్బంది పెడితే….వారెంత‌టి వారైనా స‌రే ఒక ప‌ట్టాన విడిచి పెట్టే…

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి వివాదాల‌కు మారుపేరు. ఆయ‌న‌కు కోపం వ‌చ్చిందంటే…త‌న మ‌న అనే తేడా ఉండ‌దు. త‌న‌ను ఇబ్బంది పెడితే….వారెంత‌టి వారైనా స‌రే ఒక ప‌ట్టాన విడిచి పెట్టే స్వ‌భావం ఆయ‌న‌ది కాదు. సోష‌ల్ మీడియాలో త‌న‌ను టార్గెట్ చేస్తున్న కొంద‌రు సొంత పార్టీ వాళ్ల‌పై ఆయ‌న తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తీవ్ర ప‌ద‌జాలంతో నిప్పులు చెరిగారు.

బీజేపీ ఐటీ సెల్‌లో వెధ‌వ‌లు ఉన్నార‌ని ఆయ‌న తీవ్ర వ్యాఖ్య చేశారు. సోష‌ల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల‌తో త‌న‌పై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగుతున్నారంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేరకు ఆయ‌న ట్వీట్ చేశారు.

‘ఈ ఐటీ సెల్‌ వెధవల వ్యాఖ్యలకు బీజేపీ ఎలా బాధ్యత వహించదో.. నాపై దూషణలకు దిగేవారిపై నా అభిమానులు కోపంతో చేసే వ్యక్తిగత దాడులకు కూడా నేను అలాగే బాధ్యత వహించను’ అని తేల్చి చెప్పారు.  వ్యక్తిగత దూషణలకు దిగుతున్నవారిని వెంటనే పార్టీ నుంచి తొలగించాలని ఆయ‌న డిమాండ్‌ చేశారు.

‘మన పార్టీ మర్యాదరామన్నలదే కాని రావణాసురులది, దుశ్శాసనులది కాదు కదా’ అని మరో ట్వీట్‌లో ఆయ‌న ప్ర‌శ్నించారు. మ‌రి సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ట్వీట్ల‌పై బీజేపీ ఎలా స్పందిస్తుందోన‌నే ఉత్కంఠ నెల‌కొంది. 

నిమ్మ‌గ‌డ్డ క‌మ్మోడు కాబ‌ట్టే…ఉతికి ఆరేసిన పోసాని

ప్రభాస్ 2 కోట్ల విరాళం