పెళ్లయిపోయింది..పిల్ల తల్లయిపోయింది అనుకున్నారేమో..కానీ మళ్లీ ఎంట్రీ ఇస్తే ఎలా వుంటుంది? సీనియర్ హీరోయిన్ కాజల్ సంగతే ఇది. తెలుగులో మాంచి సత్తా, గ్లామర్ వున్న హీరోయిన్ గా, డ్యాన్సర్ గా కూడా పేరు తెచ్చుకుంది.
సీనియర్, జూనియర్ ఇలా అందరు హీరోయిన్ల పక్కన జోడీగా నటించేసింది. పెళ్లి చేసుకుని, తల్లి కూడా అయిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ లో మళ్లీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు వున్నట్లు తెలుస్తోంది.
ఓ భారీ సినిమాలో హీరోయిన్ గా కాజల్ పేరు పరిశీలనలో వున్నట్లు తెలుస్తోంది. అది ఓకె అయిపోతే మళ్లీ తెలుగులో కాజల్ సినిమాలు స్టార్ట్ అవుతాయి. అసలే సీనియర్ హీరోలు తమ పక్కన సరైన హీరోయిన్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. సీనియర్ హీరోలు అందరూ ఇప్పుడు ఫుల్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నారు. అందువల్ల వన్స్ కాజల్ రీ ఎంట్రీ ఇస్తే చకచకా అవకాశాలు అందుకోవచ్చు.
ఇప్పటికే కొందరు సీనియర్ హీరోయిన్లు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు కానీ హీరోయిన్లుగా మాత్రం కాదు. అమ్మ పాత్రలు, అక్క పాత్రలు, స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. కాజల్ మాత్రం హీరోయిన్ గానే ఎంట్రీ ఇస్తానంటోందట.
Hello
When fruits are became juice how the fruits will come 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
antha mogadu naakeshi vuntaadu…..adhe dabbu…..now coming again for it
Arrrey naa comments anni thesesaru very bad news channel