ఆ రంగారావు..ఈ రంగారావు..ఈ అక్కినేని..తొక్కినేని

వేదికల మీద మాట్లాడేపుడు చాలా జాగ్రత్తగా వుండాలి. పెదవి దాటిన మాట పృధివి దాటుతుంది అన్నారు. అసలే డిజిటల్ మీడియా యుగం. వెనక్కు తీసుకోలేము. నందమూరి బాలకృష్ణ దగ్గర సమస్య ఏమిటంటే ఆయనలో విషయం…

వేదికల మీద మాట్లాడేపుడు చాలా జాగ్రత్తగా వుండాలి. పెదవి దాటిన మాట పృధివి దాటుతుంది అన్నారు. అసలే డిజిటల్ మీడియా యుగం. వెనక్కు తీసుకోలేము. నందమూరి బాలకృష్ణ దగ్గర సమస్య ఏమిటంటే ఆయనలో విషయం ఎంతో వుంటుంది. కానీ దానికి ఓ స్క్రీన్ ప్లే, వరుస, వాడి వుండదు. 

ఏది వస్తే అది మాట్లాడేస్తూ వుంటారు. ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేస్తూ మాట్లాడేస్తారు. ఈ మాటలు అలా అలా సాగిపోయినంత వరకు ఫరవాలేదు. పొరపాటు మాటలు వస్తేనే కష్టం.

నిన్నటికి నిన్న వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో, ఏదో మాట్లాడుతూ, పక్కన ఎవరి గురించో చెబుతూ, ‘ఈయన వున్నాడంటే సెట్ లో ఏదో ఒకటి…ఆ రంగారావు..ఈ రంగారావు ..అక్కినేని..తొక్కినేని..’ అంటూ మాట పడేసారు. అక్కినేని..తొక్కినేని అన్న పద ప్రయోగం వాడడం ఎంత వరకు గౌరవప్రదం అన్నది బాలయ్య నే చెప్పాలి. కర్మ ఏమిటంటే, ఎవరూ ఈ మాటలను సీరియస్ గా తీసుకోరు. లైట్ తీసుకుంటారు. అందుకే ఆయన చిత్తానికి మాట్లాడేస్తుంటారు.

ఇదే సభలో బాలయ్య మరో మాట కూడా అన్నారు. నీతి..నిజాయతీతో ఘర్జించాలి అంటే తనలా సింహంలా పుట్టాలని… దాని మీద కూడా టాలీవుడ్ లో కామెంట్లు వినిపిస్తున్నాయి.