మెరుపు తీగలా వచ్చి మాయమైన సమంత?

సమంత ఇప్పుడెక్కడుంది.. ఏం చేస్తోంది..? ఆమె అమెరికాలో ఉంది. ట్రీట్ మెంట్ కోసం రెడీ అవుతోంది. ఎవరైనా ఇదే సమాధానం చెబుతారు. ఆమె ఇనస్టాగ్రామ్ ఎకౌంట్ కూడా ఇదే చెబుతుంది. కానీ సమంత అమెరికాలో…

సమంత ఇప్పుడెక్కడుంది.. ఏం చేస్తోంది..? ఆమె అమెరికాలో ఉంది. ట్రీట్ మెంట్ కోసం రెడీ అవుతోంది. ఎవరైనా ఇదే సమాధానం చెబుతారు. ఆమె ఇనస్టాగ్రామ్ ఎకౌంట్ కూడా ఇదే చెబుతుంది. కానీ సమంత అమెరికాలో లేదు. అవును.. ఆమె మెరుపులా హైదరాబాద్ లో ప్రత్యక్షమైంది. 24 గంటల పాటు సిటీలో ఉంది. తిరిగి అమెరికా వెళ్లిపోయింది.

“అవును.. సమంత హైదరాబాద్ వచ్చింది. అయితే ఆమె ఒక రోజు మాత్రమే ఉంది. ఆ వెంటనే అమెరికాకు వెళ్లిపోయింది. ట్రీట్ మెంట్ కొనసాగిస్తోంది. ఆమె ఎలాంటి కొత్త స్క్రిప్టులు వినలేదు. ఆమె తిరిగి వస్తుందని అస్సలు ఊహించలేదు.” సమంతకు చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి ఇచ్చిన సమాధానం ఇది.

ఖుషి సినిమాలో నటించింది సమంత. అమెరికాలో ఈ సినిమా హిట్టయింది. అదే టైపులో ఏపీ,నైజాంలో కూడా సక్సెస్ అయిందని సమంత భావించింది. కానీ సినిమా వసూళ్లు పడిపోయాయి. దీనికితోడు వర్షాలు కూడా తోడవ్వడంతో ఖుషి సినిమాకు ఆక్యుపెన్సీ పడిపోయింది.

ఖుషి సినిమాకు వసూళ్లు బాగుంటే, మరోసారి ప్రచారం చేయాలని సమంత భావించిందంట. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రచారానికి దూరంగా ఉండడమే బెటరని ఆమె భావిస్తోంది. అమెరికాలో ఖుషి హిట్టయింది. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లతో సమంత ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. సమంతను తమ లక్కీ ఛార్మ్ గా చెప్పుకొచ్చారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. కానీ ఆ 'మేజిక్ టచ్' తెలుగు రాష్ట్రాల్లో పనిచేయలేదు.

ఖుషి కంటే ముందు సమంత చేసిన శాకుంతలం సినిమా ఫ్లాప్ అయింది. అయితే అంతకంటే ముందు ఆమె చేసిన యశోద మాత్రం సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో, తన నెక్ట్స్ మూవీ కోసం సమంత ఎలాంటి స్క్రిప్ట్ ఎంచుకుంటుందనే విషయం ఆసక్తికరంగా మారింది.