కెరీర్ ఊపు మీదున్న హీరోయిన్లను 'పెళ్లెప్పుడు' అంటూ అడగడం, పెళ్లైన హీరోయిన్లను 'పిల్లలు ఎప్పుడు ..' అని అడగడం జనాలకు రొటీనే. సామాన్యులను కూడా అలాంటి ప్రశ్నలను అంతా అడుగుతూ ఉంటారు. హీరోయిన్లకూ అలాంటి ప్రశ్నలు సహజంగానే తప్పవు.
ఇలాంటి క్రమంలో నటి సమంతకు కూడా ఆ ప్రశ్న తరచూ వెంటాడుతూ ఉంది. ఇన్ స్టాగ్రమ్ లో చాటింగ్ కు వచ్చినా ఆమెను కాసేపట్లోనే ఆ ప్రశ్న పలకరించింది. 'పిల్లలెప్పుడు..' అంటూ ఆమె ఫాలోయర్లు అడగనే అడిగేశారు.
ఈ అంశంపై ఆమె ఆసక్తిదాయకమైన రీతిలో స్పందించింది. రొటీన్ సమాధానం కాకుండా.. తనకు ఎప్పుడు పిల్లలు పుట్టబోతున్నారో ముహూర్తాన్ని కూడా ప్రకటించింది సమంత. 2022 సంవత్సరం ఆగస్టు ఏడో తేదీ, ఏడు గంటలకు .. అంటూ సీరియస్ గా సమాధానం ఇచ్చేసింది సమంత.
ఆమె ఎంత సీరియస్ గా చెప్పినా.. ఈ డేట్ ను బట్టి చూస్తే మాత్రం ఇది జస్ట్ జోకింగ్ అని మాత్రం స్పష్టం అవుతోంది. పిల్లలు ఎప్పుడనే అంశం గురించి రొటీన్ సమాధానాన్ని కాకుండా, భిన్నమైన సమాధానాన్ని ఇచ్చింది ఈ హీరోయిన్. కొత్తదనం ఉండాలి కదా!