ట్విట్టర్ లో మహేష్ బాబు కు ‘సరిలేరు’

ట్విట్టర్ లో ట్రెండింగ్, యూ ట్యూబ్ లో ట్రెండింగ్ అన్నది ఇప్పుడు హీరోలకు, టాలీవుడ్ కు, అంతకు మించి ఫ్యాన్స్ కు కావాల్సింది. అందుకోసమే కిందా మీదా పడుతుంటారు. Advertisement ట్విట్టర్ లో హీరోలకు…

ట్విట్టర్ లో ట్రెండింగ్, యూ ట్యూబ్ లో ట్రెండింగ్ అన్నది ఇప్పుడు హీరోలకు, టాలీవుడ్ కు, అంతకు మించి ఫ్యాన్స్ కు కావాల్సింది. అందుకోసమే కిందా మీదా పడుతుంటారు.

ట్విట్టర్ లో హీరోలకు ఫాలోవర్స్ భారీ సంఖ్యలో వుంటారు. లైక్ లు రీ ట్వీట్ లు కొడుతుంటారు. దాంతో పబ్లిసిటీ మెటీరియల్ ట్రెండింగ్ లోకి వస్తుంటుంది.

మామూలుగానే ట్విట్టర్ లో మహేష్ బాబు సోషల్ మీడియా టీమ్ యాక్టివ్ గా వుంటుంది. ఇప్పుడు ఫ్యాన్స్ ను కూడా పూర్తిగా ఇన్ వాల్వ్ చేసి, ప్రతి పబ్లిసిటీ మెటీరియల్ ట్రెండింగ్ లోకి తెచ్చేందుకు ఓ కొత్త అయిడియా  చేసారు.

దీని కోసం ట్విట్టర్ నుంచి ఓ టూల్ ను తీసుకున్నారు. ఇది ఇలా తీసుకోవడం తెలుగులో తొలిసారి అనే చెప్పాలి.

ఇది ఎలాపని చేస్తుంది అంటే, ట్విట్టర్ లోకి వదిలిన మోషన్ పోస్టర్ లేదా టీజర్ లేదా మరేదైనా చూడాలి అంటే వెంటనే కనిపించదు. రీ ట్వీట్ కొడితేనే కనిపిస్తుంది.

అంటే ట్విట్టర్ లోకి వదిలిన పబ్లిసిటీ మెటీరియల్ ను చూడాలంటే రీ ట్వీట్ కొట్టాల్సిందే. మిలియన్లలో వున్న ఫాలోవర్లు అందరూ రీ ట్వీట్ లు కొడితే అది భయంకరంగా ట్రెండింగ్ అవుతుంది.

ఈ కొత్త ప్రయత్నంలో భాగంగా ఈరోజు సాయిత్రం సరిలేరు నీకెవ్వరూ సినిమా టీజర్ డేడ్ కు సంబంధించి మోషన్ పోస్టర్ ఒకటి విడుదల చేయబోతున్నారు. టీజర్ ఈ వీకెండ్ లో వస్తుంది. 

ఆ డేట్, టైమ్ వివరాలతో మోషన్ పోస్టర్ తయారుచేసి, ఈ సాయంత్రం లాక్ చేసి వదులుతారు. అది చూడాలంటే రీట్వీట్ కొట్టాలన్న మాట. అదీ విషయం.