ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాల్ షీట్ల డేట్లు మళ్లీ మారాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్-రామ్ చరణ్ డేట్ లు ముందుగా అనుకున్నది 2020 జనవరి లేదా ఫిబ్రవరి నాటికే అని. మార్చి నాటికి ఇద్దరు హీరోలు ఫ్రీ అయిపోతారని వార్తలు వచ్చాయి.
కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం ఇద్దరు హీరోలు మే నెలాఖరు వరకు ఆర్ఆర్ఆర్ మీదే వర్క్ చేయాల్సి వుంటుంది. ఆ తరువాత ప్రచారం వ్యవహారాలువేరు. అంటే ఎన్టీఆర్ సినిమా మళ్లీ మరోటి సెట్ మీదకు వెళ్లాలంటే జూన్ వరకు ఆగాల్సిందే.
మరి ఇలాంటి నేపథ్యంలో త్రివిక్రమ్ ఏం చేస్తారు అన్నది క్వశ్చను. జనవరి నుంచి త్రివిక్రమ్ ఫ్రీ అయిపోతారు. జూన్ వరకు అంటే కనీసం ఆరు నెలలు ఎన్టీఆర్ కోసం వెయిట్ చేయాలి. స్క్రిప్ట్ వర్క్ ఎలా వుంటుంది కాబట్టి వెయిట్ చేస్తారనే అనుకోవాలి.
భాగస్వామ్యం పక్కా
ఈసారి హారిక హాసిని సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ తో జత కడుతోంది. బన్నీ సినిమా కోసం గీతాతో జత కట్టినట్లే, ఎన్టీఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ ఆర్ట్స్ తో భాగస్వామ్యం తప్పడం లేదు. ఎన్టీఆర్ కు 35 కోట్ల రెమ్యూనిరేషన్ ఇచ్చి, ఎన్టీఆర్ ఆర్ట్స్ కు సగం లాభాలు ఇవ్వడం అన్నది ఒప్పందంగా వుండే అవకాశం వుంది.
బన్నీతో సినిమా కూడా ఇదే ఒప్పందం.అయితే బన్నీ రెమ్యూనిరేషన్ పాతిక కోట్ల మేరకు కాబట్టి, సగం లాభాలు గీతాకు ఇచ్చినా సమస్య లేదు. కానీ ఎన్టీఆర్ కు 35 ఇచ్చి సగం లాభాలు ఇవ్వడం అంటే బహుశ ఇక హారిక హాసినికి ఇక మిగిలేది ఏమీ వుండకపోవచ్చు.
ఎందుకంటే మహేష్, బన్నీ, ఎన్టీఆర్ టాప్ హీరోలు ఎవరైనా మార్కెట్ మాత్రం అన్నీ కలిపి 150 కోట్ల దగ్గర మేకు కొట్టేసినట్లు అయిపోయింది. 100 కోట్లకు పైగా ప్రొడక్షన్, హీరోకి 35, పబ్లిసిటీ కలిపితే మిగిలేది ఎంత? అందులో సగం అంటే ఎంత? నానికి జెర్సీలో భాగస్వామ్యం ఇచ్చి మిగుల్చుకున్నది ఏమీ లేదు.
హీరోల డేట్ ల కోసం ఇలాంటి డీల్స్ లో దిగుతూ పెద్ద నిర్మాణ సంస్థలు కేవలం సినిమాలు తీసాం అనిపించుకుంటున్నాయి తప్ప, లాభాలు ఆర్జిస్తున్నాం అని అనిపించుకోలేకపోతున్నాయి.