‘రూ. 200 షర్ట్ లే వేసుకుంటా’: స్టార్ హీరో

తను ధరించే టీషర్టుల విలువ రెండు మూడు వందల రూపాయలే ఉంటాయని అంటున్నాడు కన్నడ స్టార్ హీరో సుదీప్. కేవలం కన్నడ కే పరిమితం కాకుండా తెలుగు, హిందీల్లో కూడా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న…

తను ధరించే టీషర్టుల విలువ రెండు మూడు వందల రూపాయలే ఉంటాయని అంటున్నాడు కన్నడ స్టార్ హీరో సుదీప్. కేవలం కన్నడ కే పరిమితం కాకుండా తెలుగు, హిందీల్లో కూడా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ నటుడు భారీ పారితోషకాన్ని కూడా తీసుకుంటూ ఉన్నాడు. తనకంటూ ఉన్న ప్రత్యేకతను ఫుల్ గా క్యాష్ చేసుకుంటూ ఉన్నాడు.

అయితే వ్యక్తిగత జీవితంలో తన లగ్జరీలు ఏమీ ఉండవని సుదీప్ తేల్చి చెప్పాడు. ఇకప్పుడు కాస్ట్లీ వస్తువులను వాడి, కటౌట్ లు చూసుకుని ఎంజాయ్ చేసే మానసిక స్థితిలో తను లేనని సుదీప్ తేల్చి చెప్పాడు.
 
ఒకసారి తన పుట్టిన రోజును అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారని, అప్పుడు తను కూడా ఎంజాయ్ చేశానని, పార్టీ అంతా అయిపోయాకా ఒక వీధి బాలిక కింద పడిపోయిన కేక్ ను ఏరుకుని తినడాన్ని తను గమనించినట్టుగా సుదీప్ చెప్పాడు. ఆ దృశ్యం తనను తీవ్రంగా కలిచి వేసిందని, అప్పటి నుంచి బర్త్ డే అంటూ హంగామా చేయడం ఆగిపోయిందని చెప్పాడు.

తన ఫ్యాన్స్ తన పుట్టిన రోజును చేయాలనుకుంటే.. వాళ్ల ఇంటి దగ్గరే కేక్ కట్ చేసి, వాళ్ల వీధిలో పంచమని తను చెబుతున్నట్టుగా సుదీప్ చెప్పాడు. తన వ్యక్తిగత జీవితంలో కూడా ఆ తర్వాత చాలా మార్పు వచ్చిందని, అర్భాటాలు అనవసరం అని గ్రహించినట్టుగా సుదీప్ వివరించాడు. ఇప్పుడు తను వేసుకునే టీషర్టుల విలువ కూడా రెండు మూడు వందల రూపాయల ఉంటుందని సుదీప్ చెప్పాడు.