మరో హీరోయిన్ తల్లి కాబోతోందా.. జోరుగా పుకార్లు

హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాతృత్వాన్ని కూడా ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అలియా భట్ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడీ కోవలోకి మరో హీరోయిన్ చేరబోతోంది. అవును.. హీరోయిన్…

హీరోయిన్లు వరుసగా పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాతృత్వాన్ని కూడా ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అలియా భట్ బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడీ కోవలోకి మరో హీరోయిన్ చేరబోతోంది. అవును.. హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలోనే తల్లికాబోతోందంట. ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ ఇదే.

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి చేసుకున్నారు. వాళ్ల పెళ్లయి ఏడాది దాటింది కూడా. రాజస్థాన్ లోని ఓ స్టార్ రిసార్ట్ లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అప్పట్నుంచి వైవాహిక బంధాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ, తాజాగా ముంబయి ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంట పడింది.

ఆ స్టిల్స్ లో ఆమె వదులైన దుస్తులు ధరించి ఉంది. పైగా ఆ దుస్తుల్లోంచి కూడా ఆమె పొట్ట కాస్త ఉబ్బెత్తుగా కనిపించింది. దీంతో కత్రినా కైఫ్ గర్భం దాల్చిందంటూ బాలీవుడ్ మీడియా కథనాలు అందుకుంది. తన గర్భాన్ని దాచిపెట్టడం కోసమే కత్రినా అలా వదులైన దుస్తులు ధరించిందని అంటోంది.

అయితే ఈ రోజుల్లో అలా గర్భాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అలియాభట్, కాజల్ లాంటి హీరోయిన్లు ఓపెన్ గా ఈ విషయాన్ని బయటకు చెప్పి, అందరితో సెలబ్రేట్ చేసుకున్నారు. కాబట్టి కత్రినాకైఫ్ తన గర్భాన్ని దాచిపెడుతుందని అనుకోవడానికి వీల్లేదు. త్వరలోనే దీనిపై కత్రినా ప్రకటన చేస్తుందేమో చూడాలి.