‘దేవాన్ష్ ఇంగ్లిష్ మీడియమే..’ ఏబీఎన్ రాధాకృష్ణే సాక్షి!

ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం చదువులను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ జీర్తిగాళ్ల సంగతిని పక్కన పెడితే, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ల సంతానం ఎక్కడ చదువుతోందనేది చర్చనీయాంశం. Advertisement ఈ…

ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం చదువులను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ జీర్తిగాళ్ల సంగతిని పక్కన పెడితే, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ల సంతానం ఎక్కడ చదువుతోందనేది చర్చనీయాంశం.

ఈ అంశం గురించి పవన్ కల్యాణ్ ను డైరెక్టుగా సీఎం జగన్ మోహన్ రెడ్డే అడిగారు. అయితే పెళ్లాల గురించి మాట్లాడే పవన్, పిల్లలు ఎక్కడ, ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పనే లేదు!

ఆ సంగతలా ఉంటే.. తన కొడుకు ప్రీ స్కూళ్లో కూడా ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారని నారా లోకేష్ చెప్పిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంది.  తన కొడుకును ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తున్నట్టుగా ఇది వరకే లోకేష్ సెలవిచ్చారు. 

ఏబీఎన్ రాధాకృష్ణ మీద ఒట్టు! ఆయన ఓపెన్ హార్ట్ కార్యక్రమంలో లోకేష్ ఆ విషయాన్ని చెప్పారు. తన భార్య బ్రహ్మణి .. దేవాన్ష్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటుందని, ప్రీ స్కూల్ నుంచినే ఇంగ్లిష్ మీడియంతో చదివించడంతో పాటు, ఐదేళ్లు నిండని దశ నుంచినే జపానీస్ ఇతర లాంగ్వేజ్ క్లాస్ లకు కూడా పంపుతున్నట్టుగా లోకేష్ ఆ ఇంటర్వ్యూలో వివరించారు.

ఇదీ కథ. లోకేష్ తనయుడు ఏమో ప్రీ స్కూల్ నుంచినే ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నాడు. ఆయన భార్య ఆ విషయంలో స్ట్రిక్ట్ గా  ఉందట. ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం ఇంగ్లిష్ మీడియం వద్దు..ఇదీ తెలుగుదేశం అజెండా.

'తెలుగుదేశం' అంటూ పొలిటికల్ మార్కెటింగ్ చేసుకునే వారే తెలుగు మీడియంలో చదవరు, బీదాబిక్కి మాత్రం తెలుగుదేశంలోనే చదవాలి. ఇదీ తెలుగుదేశం మార్కు నీతి.