నారా లోకేష్ ఎత్తిపోతలపై పోలీస్ సీరియస్

కరోనా టైమ్ లో లోకేష్ బాబు ఏంచేస్తున్నారయ్యా అంటే.. ఫేస్ బుక్ లోవి ట్విట్టర్లోకి, ట్విట్టర్లోవి ఇనస్టా లోకి ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ చేస్తున్నారనే సమాధానమే వస్తుంది. కరోనా పేరు చెప్పుకుని ఇంట్లోనే కూర్చున్న…

కరోనా టైమ్ లో లోకేష్ బాబు ఏంచేస్తున్నారయ్యా అంటే.. ఫేస్ బుక్ లోవి ట్విట్టర్లోకి, ట్విట్టర్లోవి ఇనస్టా లోకి ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ చేస్తున్నారనే సమాధానమే వస్తుంది. కరోనా పేరు చెప్పుకుని ఇంట్లోనే కూర్చున్న లోకేష్.. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియోని వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారంలోకి తేవాలని చూస్తుంటారు. తాజాగా విలేకరిపై వైసీపీ గూండాల దాడి అంటూ ఓ వీడియో పోస్ట్ చేసి దారుణంగా బుక్కయ్యారు లోకేష్.

చిత్తూరు జిల్లా పోలీసులు సదరు ఆరోపణను లోతుగా విచారణ జరిపి వాస్తవాలు బైటపెట్టారు. దీంతో లోకేష్ గుట్టు రట్టయింది.

చిత్తూరు జిల్లాలో ఒక హెడ్మాస్టర్ ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో సదరు విలేకరి జోక్యం చేసుకోవాలని చూశారట. హెడ్మాస్టర్ ని కేసు నుంచి తప్పించేందుకు బాలిక తల్లిపై ఒత్తిడి తీసుకురావాలనిప్రయత్నించారట. దీంతో బాలిక తండ్రి ఇతర కుటుంబ సభ్యులు విలేకరి ఇంటిపై దాడి చేశారు. అసలీ విషయంలో వైసీపీ ప్రస్తావనే లేదు. బాధితులకు వైసీపీ ముద్రవేసి, విలేకరులపై దౌర్జన్యాలు, దాడులు అంటూ రెచ్చిపోయారు లోకేష్.

పోలీసుల వివరణలో లోకేష్ బండారం మొత్తం బైటపడింది. ఈ సంఘటనలో తన పాత్ర ఉందంటూ ట్వీట్ చేసిన లోకేష్ పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అబద్ధాలు, విష ప్రచారాలు, ఆధారాలు లేని ఆరోపణలతో రాజకీయంగా ఎదిగిన చంద్రబాబు తన కొడుకుని కూడా అదే దారిలో నడిపిస్తున్నారని మండిపడ్డారు.

వీరిద్దరి వ్యవహార శైలి ఈ రాష్ట్రాపనికి శాపం అని, చంద్రబాబుతో పాటు లోకేష్ బుర్ర కూడా విషంతో నిండిపోయిందని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఇలాంటి విష రాజకీయాలు చేస్తే ప్రజలు చెప్పుతో కొట్టే రోజు వస్తుందని, నిర్మాణాత్మక విమర్శలు చేస్తే స్వాగతిస్తామని, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే తండ్రీ కొడుకులిద్దరికీ ప్రజలు బడితె పూజ చేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

కొంతకాలంగా టీడీపీ చేస్తున్న రకరకాల ఆరోపణల్లో పసలేదని అర్థమవుతోంది. పూర్తిగా వ్యక్తిగత ఆరోపణలు, ఆధారాలు లేని అర్థ సత్యాలు ప్రచారం చేస్తున్నాయి టీడీపీ శ్రేణులు. మంత్రిగా పనిచేసి, ఎమ్మెల్సీ అనే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న లోకేష్ కూడా ఇలాంటి ట్వీట్లతో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూడటమే మరింత దుర్మార్గం. విషయం తెలుసుకోకుండా ఇలాంటి ట్వీట్లు వేస్తే పోయేది లోకేష్ పరువేనని మరోసారి రుజువైంది. 

లీడ‌ర్లా..పేకా‌ట పాపారాయుల్లా!