హీరో రాజ్ తరుణ్ కాస్త గ్యీప్ తీసుకుని చేస్తున్న సినిమాల్లో 'ఇద్దరి లోకం ఒకటే' విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాకు ఓ విదేశీ సినిమా ఆధారం అని తెలుస్తోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తీసుకుని నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా విషాదాంతం అని వినిపిస్తోంది. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ల కోసం హీరోలు త్యాగాలు చేస్తుంటారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ నే హీరో కోసం త్యాగం చేస్తుందని తెలుస్తోంది. సినిమాకు అదే హైలైట్ పాయింట్ గా వుంటుందని తెలుస్తోంది.
పెద్ద హీరోల సినిమాలు అయితే విషాదాంతం అయితే ఫ్యాన్స్ ఓకె అనరు. కానీ చిన్న హీరోల సినిమాలు అయినపుడు, వాటిని పెద్ద బ్యానర్లు తీసినపుడు కాస్త ప్రయోగాలు చేయవచ్చు.
అందుకే దిల్ రాజు ఈ సినిమా స్క్రిప్ట్ ను ఓకె చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను గల్లా అశోక్ తో తీయాలనుకున్నారు. కానీ కొత్త హీరో సరిపోకపోవడంతో, ప్రాజెక్టు రాజ్ తరుణ్ చేతిలోకి వచ్చింది.