నిక్ జోనస్ ను వివాహం చేసుకున్నాకా ప్రియాంక రేంజ్ చాలానే పెరిగిపోయినట్టుగా ఉంది. ఎంతలా అంటే.. భారతీయ హీరోయిన్లు ఎవరూ అనుభవించలేని వైభవాన్ని ఆమె సొంతం చేసుకుంటున్నట్టుగా ఉంది. ఈ హీరోయిన్ కొత్త ఇంటి గురించి ఆసక్తిదాయకమైన కథనాలు వస్తన్నాయి. వాటి సారాంశం ఏమిటంటే..ప్రియాంక, ఆమె భర్త నిక్ జోనస్ లు ఒక ఇంద్రభవనం లాంటి ఇంటిని కొన్నారట.
దాని ధర సుమారుగా 144 కోట్ల రూపాయలు ఉంటుందని అమెరికన్ మీడియా చెబుతూ ఉంది. దాదాపు ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంటుందట ఆ ఇల్లు. లాస్ ఏంజెలెస్ లో ఈ ఇంటిని కొన్నారట ప్రియాంక, నిక్. ఆ మహానగరమే విలాసానికి చిరునామా. అలాంటి విలాసవంతమైన నగరంలో అత్యంత విలాసవంతమైన భవంతిని నిక్, ప్రియాంకలు రూపొందించుకుంటున్నారట.