అల..అల..ఏమిటి ఇలా?

అల వైకుంఠపురములో..బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా. ఈ సినిమాకు ఇప్పటి వరకు వచ్చిన పబ్లిసిటీ సినిమా మెటీరియల్ ఒక ఎత్తు. Advertisement ఈ రోజు విడుదలయిన విడియో సాంగ్ టీజర్ ఒక ఎత్తు.…

అల వైకుంఠపురములో..బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా. ఈ సినిమాకు ఇప్పటి వరకు వచ్చిన పబ్లిసిటీ సినిమా మెటీరియల్ ఒక ఎత్తు.

ఈ రోజు విడుదలయిన విడియో సాంగ్ టీజర్ ఒక ఎత్తు. అలా అని ఇది అన్నింటికన్నా సూపర్ అనుకుంటే పొరపాటే. అన్నింటికన్నా దిగదుడుపు ఇదే.

బన్నీ పిల్లల కోసం విడుదల చేయాలని ముందుగా డిసైడ్ అయిపోయి, పిల్లలు ఆడుకుంటే విడియో తీసి, దాన్ని ఎలాగోలా ఎడిట్ చేసి, పాటకు లింక్ చేసి వదిలినట్లుంది.

పాట బిట్ కానీ, పిల్లల ఆటలు కానీ ఒకదానికి ఒకటి సింక్ కాలేదు. దానికి తోడు విడియోకి వాడిన బ్రైట్ కలర్ గ్రాఫిక్స్ కూడా సింక్ కాలేదు.

ఇప్పటి వరకు అల వైకుంఠపురములో సినిమాకు వదిలిన పబ్లిసిటీ మెటీరియల్ అంతా క్లాస్ టచ్ తో వుంది.

ఈ విడియో కేవలం బన్నీ పిల్లలను ఏదో విధంగా సినిమా ప్రచారంలోకి తీసుకురావాలని చేసినట్లుంది తప్ప, దాంతో సింక్ అయ్యేలా లేదు అన్నది వాస్తవంగా చెప్పాల్సిన మాట.