సమంత నిర్ణయం మార్చుకోవచ్చేమో?

ఖుషీ ఫలితంతో హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత ఇద్దరూ ఫుల్ హ్యాపీనే. కాస్త గ్యాప్ తరువాత హిట్ అనిపించుకున్న సినిమా పడింది విజయ్ కు. సమంత పరిస్థితి కూడా అదే. గుణశేఖర్ శాకుంతల…

ఖుషీ ఫలితంతో హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ సమంత ఇద్దరూ ఫుల్ హ్యాపీనే. కాస్త గ్యాప్ తరువాత హిట్ అనిపించుకున్న సినిమా పడింది విజయ్ కు. సమంత పరిస్థితి కూడా అదే. గుణశేఖర్ శాకుంతల సినిమాలో సమంత గెటప్ ఆమెకు నెగిటివ్ రిమార్క్ లు తెచ్చింది. తన ఆరోగ్య సమస్యల కారణంగా ఇటీవల ఆమె ఫేస్ లో మార్పులు వచ్చాయి. ఒకటి రెండు పబ్లిక్ అప్పీరియన్స్ లు కూడా ఆమెకు మరింత నెగిటివ్ చేసాయి.

ఇలాంటి టైమ్ లో సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంటున్నా అని చెప్పేసారు కూడా . దీంతో ఫ్యాన్స్ ఇక సమంత రిటైర్ నే అనేంతగా ఫీలయ్యారు. ఇలాంటి టైమ్ లో ఖుషీ వచ్చింది. కొందరు జస్ట్ ఓకె అన్నా, కొందరు సూపర్ గా వుంది అన్నా మొత్తానికి గ్లామర్ పార్ట్ గా సమంత మార్కులు సంపాదించుకున్నట్లే. 

యంగ్ హీరోల పక్కన కొత్త కొత్త హీరోయిన్లను తీసుకువస్తున్న బ్యాక్ డ్రాప్ లో విజయ్ పక్కన నటించి ఓకె అనిపించుకుంది తప్ప నెగిటివ్ కాలేదు. పైగా రొమాంటిక్ సీన్లలో కూడా సమంత బాగుంది అనిపించుకుంది.

తెలుగులో హీరోయిన్ల కొరత చాలా వుంది. నటన విషయంలో సమంత కు కొత్తగా సర్టిఫికెట్ లు ఇవ్వక్కరలేదు. కాస్త యంగ్ గ్లామరస్ లుక్స్ తో కనిపించగలిగితే చాలు. కొన్ని సినిమాలు అయినా చేతిలోకి వస్తాయి. యంగ్ హీరోలను పక్కన పెడితే సీనియర్ హీరోలు చాలా మంది వున్నారు. వాళ్లకు ఎప్పుడూ హీరోయిన్ల సమస్యే. అందువల్ల సమంత కనుక కాస్త యాక్టివ్ అయితే మళ్లీ టాలీవుడ్ లో సినిమాలు చేతిలోకి వస్తాయేమో?