అజిత్ దెబ్బ.. విజయ్ సినిమాకు తక్కువ వసూళ్లు

రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజైతే ఆ రెండు సినిమాలకూ నష్టమే. థియేటర్లు తగ్గిపోతాయి, ఫలితంగా ఓపెనింగ్స్ పడిపోతాయి. ఇలా హీరోల ఫ్యాన్ వార్ మధ్య నిర్మాతలు, బయ్యర్లు నలిగిపోతున్నారు. తెలుగులో ఇలాంటి…

రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజైతే ఆ రెండు సినిమాలకూ నష్టమే. థియేటర్లు తగ్గిపోతాయి, ఫలితంగా ఓపెనింగ్స్ పడిపోతాయి. ఇలా హీరోల ఫ్యాన్ వార్ మధ్య నిర్మాతలు, బయ్యర్లు నలిగిపోతున్నారు. తెలుగులో ఇలాంటి సందర్భాలు చాలానే చూశాం. ఇప్పుడు కోలీవుడ్ లో సేమ్ సీన్ రిపీట్ అయింది.

తమిళనాట ఇద్దరు పెద్ద హీరోలు విజయ్-అజిత్ పోటీ పడ్డారు. అజిత్ నటించిన తునివు, విజయ్ నటించిన వారిసు సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చాయి. అసలే తమిళనాడులో థియేటర్ల సంఖ్య తక్కువ. తెలుగు రాష్ట్రాలతో కలిపి చూసుకుంటే, మనకున్న థియేటర్ల సంఖ్యలో 60శాతం కూడా తమిళనాడులో లేవు.

దీంతో విజయ్, అజిత్ సినిమాలు, థియేటర్లను చెరిసగం పంచుకోవాల్సి వచ్చింది. దీంతో ఆ ప్రభావం రెండు సినిమాలపై పడింది. మరీ ముఖ్యంగా విజయ్ సినిమాపై ఆ ప్రభావం గట్టిగా పడింది.

విజయ్ ఏ సినిమా చేసినా, రిజల్ట్ తో సంబంధం లేకుండా 50 కోట్ల మార్క్ దాటాల్సిందే. సినిమా ఫ్లాప్ అయినా, హిట్ అయినా మొదటి రోజు వరల్డ్ వైడ్ 50 కోట్ల గ్రాస్ అనేది విజయ్ సినిమాలకు కామన్. గడిచిన ఆరేళ్లుగా ప్రతి సినిమాతో ఈ ఫీట్ సాధిస్తున్నాడు విజయ్. కానీ తాజా చిత్రంతో ఫెయిల్ అయ్యాడు.

వారిసు సినిమాకు వరల్డ్ వైడ్ మొదటి రోజు 46 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. 2027 తర్వాత విజయ్ నటించిన ఓ సినిమాకు ఇంత తక్కువ గ్రాస్ రావడం ఇదే తొలిసారి. ఫ్లాప్ మూవీ బీస్ట్ తో కూడా 87 కోట్ల ఓపెనింగ్ రాబట్టిన విజయ్, వారిసుతో మాత్రం సత్తా చాటలేకపోయాడు. దీనికి కారణం అజిత్ సినిమా బరిలో నిలవడమే.

అటు అజిత్ సినిమాకు కూడా భారీగా ఓపెనింగ్స్ తగ్గిపోయాయి. తునివు సినిమా కోసం ఆఖరి నిమిషం వరకు థియేటర్ల కోసం ప్రయత్నించినప్పటికీ, నార్త్ తమిళనాడులో అజిత్ సినిమాకు స్క్రీన్స్ తగ్గాయి. అలా ఒకే రోజు థియేటర్లలోకి రావడంతో రెండు సినిమాలూ నష్టపోయాయి.