స్వామి జన్మదినం… పర్వదినం…

విశాఖ శ్రీ శారదా పీఠం అధ్పతి శ్రీ స్వరూపానందేంద్ర మహా స్వామి జన్మ దిన వేడుకలు ప్రతీ ఏటా నాగుల చవితి రోజున ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్త జనం…

విశాఖ శ్రీ శారదా పీఠం అధ్పతి శ్రీ స్వరూపానందేంద్ర మహా స్వామి జన్మ దిన వేడుకలు ప్రతీ ఏటా నాగుల చవితి రోజున ఘనంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున భక్త జనం తరలివస్తారు.

అదే స్థాయిలో రాజకీయ నేతలు కూడా పీఠానికి వస్తారు. దాంతో ఆ కోలాహలం కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. ఈసారి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పీఠానికి వచ్చి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.

ఇక స్వామి పుట్టిన శ్రీకాకుళం జిల్లాలోనూ, ఉత్తర భారతదేశంలోని శారధా పీఠాలలోనూ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇక పీఠంలో పలు హోమాలు, యాగాలు కూడా నిర్వహిస్తున్నారు.

అధికారులు అనధికారులు, రాజకీయ నేతలతో విశాఖ శారదాపీఠం పెద్ద ఎత్తున సందడి చేస్తోంది. స్వామి జన్మదిన వేడుకలు అంటే ఎల్లరకూ పర్వదినంగానే ఉంటుందని పీఠం నిర్వాహకులు చెబుతున్నారు. మరో వైపు పార్టీలకు అతీతంగా పీఠానికి నేతలు తరలి రావడమూ విశేషమే. తన జన్మ దినం వేళ స్వామి భక్తులకు ఇచ్చే సందేశం మీద కూడా ఆసక్తి నెలకొంది.