కేసీఆర్‌ను బ‌రాబ‌ర్ జైలుకు పంపితీరుతాం

తెలంగాణ ముఖ్య‌మంత్రి దాదాపు గంట‌కు పైగా బీజేపీ నేత‌ల‌కు చేసిన హెచ్చ‌రిక‌లు ప‌ని చేయ‌లేదు. కేసీఆర్‌ను బ‌రాబర్ జైలుకు పంపితీరుతామ‌ని బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ ఇవాళ మ‌రోమారు ఘాటు హెచ్చ‌రిక చేశారు. Advertisement…

తెలంగాణ ముఖ్య‌మంత్రి దాదాపు గంట‌కు పైగా బీజేపీ నేత‌ల‌కు చేసిన హెచ్చ‌రిక‌లు ప‌ని చేయ‌లేదు. కేసీఆర్‌ను బ‌రాబర్ జైలుకు పంపితీరుతామ‌ని బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ ఇవాళ మ‌రోమారు ఘాటు హెచ్చ‌రిక చేశారు.

మోడీ స‌ర్కార్‌, బీజేపీల‌పై నిన్న కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ త‌గ్గుతుంద‌ని భావించిన వాళ్ల‌కు నిరాశ త‌ప్ప‌లేదు. కేసీఆర్ హెచ్చ‌రిక‌ల‌కు బీజేపీ ఎంపీ అర్వింద్ దీటుగా కౌంట‌ర్ ఇచ్చారు. ముందుగా కేసీఆర్ ఏమ‌న్నారో చూద్దాం.

“కేసీఆర్‌ను జైలుకి పంపి ఇక్క‌డ నువ్వు బ‌తికి బ‌ట్ట‌క‌ట్టి తిరుగుత‌వ్ అనుకుంటున్న‌వా?. న‌న్ను జైలుకు పంపుత‌వా? అంత బ‌లుపా? ఇన్నిరోజులూ రోడ్డుపైన పోతుంటే కుక్క‌లు మొరుగుతాయ‌ని భావించి ఊరుకున్నాం.. ఇక ఉపేక్షించేది లేదు. ఇక‌పై అడ్డ‌దిడ్డంగా మాట్లాడితే నాలుక‌లు చీరేస్తా జాగ్ర‌త్త! న‌న్ను తిట్టినా భ‌రించినా.. తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటే ఊరుకోను. అబ‌ద్ధాలు ఆడుతున్న బీజేపీ నాయ‌కుల‌ను అడుగడుగునా అడ్డుకుంటాం” అని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

తాజాగా అర్వింద్ ఇచ్చిన కౌంట‌ర్ ఏంటో తెలుసుకుందాం.

“టీఆర్ఎస్ అధినేతను బరాబర్ జైలుకు పంపిస్తాం. ఎప్పటికైనా కేసీఆర్‎ ఖచ్చితంగా జైలుకు వెళ్తారు. కేసీఆర్ చేసిన అవినీతే ఆయన్ను జైలుకు పంపిస్తుంది. అవీనితిపై ఆధారాలను ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తాం. కేసీఆర్‎కు మతిమరుపు ఎక్కువైంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌస్‎లోనే విశ్రాంతి తీసుకోవాలి.  హుజురాబాద్ ఓటమిని సీఎం జీర్ణించుకోలేకపో తున్నారు. బీజేపీ గెలుపు నుంచి ప్రజలను ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే కేసీఆర్ తంటాలు ప‌డుతున్నారు” అని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య వ్య‌వ‌హారం రోజురోజుకూ ముదురుతోంది.

తెలంగాణ‌లో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంది. మ‌రోవైపు దుబ్బాక , తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌ములు టీఆర్ఎస్‌కు డేంజ‌ర్ సిగ్న‌ల్స్ ఇచ్చాయి. దీంతో ఇప్ప‌టి నుంచి ఆ పార్టీ బీజేపీ నుంచి వ‌స్తున్న ప్ర‌మాదాన్ని తిప్పికొట్టేందుకు స‌మాయ‌త్తం అవుతున్న‌ట్టు నిన్న‌టి కేసీఆర్ ప్రెస్‌మీట్‌ను చూస్తే ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతుంది.