తమ్ముడు రాజీపడితే … అన్నయ్యకు విరక్తి కలిగిందేమో?

అస‌లే రాజ‌కీయ కాలం ఎక్క‌డ చిన్న పాయింట్ దొరికిన ప్రత్యర్థి పార్టీ వారిపై ఆపాదించడం రాజ‌కీయ నాయ‌కుల‌కు కామ‌న్. ఇందులో అ పార్టీ ఈ పార్టీ అంటూ తేడా ఏమి లేవు. రెండు రోజులుగా…

అస‌లే రాజ‌కీయ కాలం ఎక్క‌డ చిన్న పాయింట్ దొరికిన ప్రత్యర్థి పార్టీ వారిపై ఆపాదించడం రాజ‌కీయ నాయ‌కుల‌కు కామ‌న్. ఇందులో అ పార్టీ ఈ పార్టీ అంటూ తేడా ఏమి లేవు. రెండు రోజులుగా మెగాస్టార్ చిరంజీవి న‌టించిన వాలైర్ వీర‌య్య చిత్రం విడుద‌ల ప్ర‌మోష‌న్స్ భాగంగా మీడియాతో మాట్లాడుతున్నా చిరంజీవి మాటలు రాజ‌కీయ నాయ‌కుల‌కు అపాదించుకుంటూ విమ‌ర్శ‌లు.. ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకుంటూన్నారు.

తాజాగా మెగాస్టార్ మీడియాల‌తో మాట్లాడుతూ … నాకు ఆంధ్ర రాజ‌కీయాల‌కు ఎలాంటి సంబంధం లేదు.. అక్క‌డ ఏం జ‌రుగుతున్న‌ది తెలుసుకోవాల‌న్న కూతుహాలం కూడా లేదు.. మా ఇంట్లో వ్య‌క్తి రాజ‌కీయాల్లోకి వెళ్ల‌కూడ‌దు అని అనుకోను… ప‌వ‌న్ ఇండిపెండెంట్ వ్య‌క్తి త‌న రాజ‌కీయం వెనుక నేను ఉన్నాన‌ని అంటున్నారు. నేను క్లియ‌ర్ గా చెప్పుతున్నా రాజ‌కీయల్లోకి ఇన్వాల్వ్ కావాల‌నుకోవ‌డం లేదంటూ ముక్కుసూటిగా చెప్పారు.

చిరంజీవి మాటలను ఉద్దేశిస్తూ మంత్రి అంబ‌టి రాంబాబు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై సెటైర్ వేశారు. 'తల్లిని దూషించిన వారితో తమ్ముడు రాజీపడితే …  అన్నయ్యకు రాజకీయాల పట్ల  విరక్తి కలిగిందేమో?' అంటూ మంత్రి అంబ‌టి ట్వీట్ చేశారు. గ‌తంలో టీడీపీ నుండి దూరం జ‌రిగిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఎల్లో మీడియా, టీడీపీ నాయ‌కులు చేసిన విమ‌ర్శ‌ల‌ను ఉద్దేశిస్తూ అంబ‌టి ట్వీట్ చేశారు.

గత ఎన్నిక‌ల ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ టీడీపీకి దూరంగా ఉండి పొటీ చేయ‌డంతో ఎల్లో మీడియా ప‌వ‌న్ ను వ్య‌క్తిగ‌తంగా, త‌న కుటుంబ స‌భ్యుల ప‌ట్ల నీచంగా మాట్లాడింద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఒక ఎల్లో మీడియా అధిప‌తిపై కూడా ప‌రువు న‌ష్ట ధావా వేశారు. ఇప్పుడు అదే మీడియా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చంద్ర‌బాబు పంచ‌న చేర‌డంతో ఆకాశ‌న్ని ఎత్తుతోంది.