విశాఖ ఏజెన్సీ అంటే… ?

యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. అలాగే యువత ఉత్సాహం ముందు అన్ని రకాలైన అనర్ధాలు దరిద్రాలూ కొట్టుకుపోతాయి. సమాజానికే సవాల్ చేస్తూ పెను వినాశనంగా పరిణమించిన విశాఖ ఏజెన్సీలోని గంజాయి సాగు మీద…

యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. అలాగే యువత ఉత్సాహం ముందు అన్ని రకాలైన అనర్ధాలు దరిద్రాలూ కొట్టుకుపోతాయి. సమాజానికే సవాల్ చేస్తూ పెను వినాశనంగా పరిణమించిన విశాఖ ఏజెన్సీలోని గంజాయి సాగు మీద యువత కన్నెర్ర చేసింది. 

జిల్లాలోని పాడేరులో ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయి పారద్రోలాలి అనే సంకల్పంతో పరివర్తన కార్యక్రమం పేరిట ఎస్పీ బి కృష్ణారావు అదేశాలతో నిర్వహించిన టూ కే పరుగుకు మంచి స్పందన లభించింది.

ఈ రన్ లో  పెద్ద ఎత్తున విధ్యార్దులు, యువత పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీ ప్రాంతం అంటే ఆహ్లాద వాతావరణం, ప్రకృతి రమణీయత  వంటివి గుర్తుకు వచ్చేవని అలాగే, గిరిజన సంస్కృతీ, ముగ్ధులై ఈ ప్రాంతానికి రావడానికి దేశంలోని ప్రజలు ఉత్సాహం చూపిస్తారని అన్నారు. కానీ ఇప్పటి పరిస్థితి విశాఖ ఏజెన్సీ అంటే గంజాయి పండుతుందని, దేశంలో ఎక్కడ. గంజాయి దొరికిన ఏజన్సీ వైపే అన్ని వేళ్ళూ చూపిస్తున్నారన్నారు. ఈ పద్దతి మారేలా యువత నడుంబిగించాలన్నారు.

అమాయక  గిరిజనులను ఏమార్చి స్మగ్లర్లు డబ్బు ఆశ చూపి గిరిజనుల సంప్రదాయ పంటలు వదలి గంజాయి పంట వేస్తున్నారని, గిరిజనులను పావులుగా వాడుకొని పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తున్నారన్నారు. యువత ఈ ఉచ్చులో చిక్కుకోరాదని, జైళ్ళలో మగ్గరాదని ఆయన కోరారు. 

యువత కదలివస్తే చాలు, స్మగ్లర్ల అరాచకాలకు అడ్డు కట్ట పడిపోవడం ఖాయమని అన్నారు. మొత్తానికి జిల్లా పోలీసులు ఒక వైపు రైతులకు అవగాహన కల్పిస్తూనే మరో వైపు యువతలోనూ చైతన్యాన్ని కలిగిస్తున్నారు. ఇదే స్పూర్తితో కొనసాగితే విశాఖ ఏజెన్సీ అంటే ప్రకృతి రమణీయత మళ్ళీ గుర్తుకు వస్తాయి.