మెగాస్టార్ డిసైడ్..నాట్ డిసైడ్

వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు మెగాస్టార్ చిరంజీవి.  ఎన్వీప్రసాద్ కు లూసిఫర్ రీమేక్, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ కు వేదాలం రీమేక్, అలాగే బాబీ డైరక్షన్ లో ఓ సినిమా. …

వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు మెగాస్టార్ చిరంజీవి.  ఎన్వీప్రసాద్ కు లూసిఫర్ రీమేక్, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ కు వేదాలం రీమేక్, అలాగే బాబీ డైరక్షన్ లో ఓ సినిమా.  ఈ సినిమా మైత్రీ మూవీస్ కు అని వినిపిస్తోంది. అయితే మూడు సినిమాల విషయంలో ఒక క్లారిటీకి వచ్చారు మెగాస్టార్. అదేమింటే, కొణిదెల బ్యానర్ మీద నిర్మించడం లేదన్నది. అది ఓకె. మూడు సినిమాలు వున్నా కూడా మొన్న బర్త్ డే కు ఒక్క సినిమా కూడా ప్రకటించలేదు. ఎందువల్ల? ఏది ముందు? ఏది వెనుక అన్న క్లారిటీకి రాలేకపోవడం.

ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న ఆచార్య సినిమా ఎప్పట్టి రెడీ అవుతుందన్న క్లారిటీ లేదు. అది పూర్తి చేసి కానీ ఆయన మరో సినిమా మీదకు రాలేరు. సమాంతరంగా రెండు సినిమాలు చేసే వయస్సు కాదు ఆయనది. అందువల్ల మూడు సినిమాలు ఓకె చేసి పెట్టినా, 2021లో ఆచార్య పూర్తి అయిన తరువాతే మరో సినిమా. ఆచార్య చూస్తుంటే ఇంకా చాలా  వ్యవహారం వున్నట్లు వుంది. ఎంత షూట్ అయిందో తెలియదు కానీ, ఫస్ట్ లుక్ వదలడానికే గ్రాఫిక్స్ మీద ఆధారపడ్డారు. 

ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ మూడు సినిమాలు చేయాలని, అది కూడా వేరే వాళ్ల బ్యానర్ లో అని డిసైడ్ అయ్యారు కానీ, ఏది ముందు ఏది వెనుక అన్నది మాత్రం ఫిక్స్ కాలేదని తెలుస్తోంది. ఏ బ్యానర్, ఏ డైరక్టర్ సినిమా ముందుగా స్టార్ట్ చేస్తారు. ఏది తరువాత అన్నది ఇప్పటి వరకు ఇంకా ఫిక్స్ కాలేదని, మెగాక్యాంప్ వర్గాల బోగట్టా.  ముగ్గురు డైరక్టర్లు స్క్రిప్ఠ్ లు తయారుచేస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్ డేట్ లు ఇస్తున్నారు. 

ఎవరు ముందుగా సరైన స్క్రిప్ట్ అందిస్తే, వారి సినిమానే ముందుగా ప్రారంభం అవుతుందా? లేదా తనకు ఆప్తుడు అయిన వివి వినాయక్ సినిమా, ఆపై మెహర్ రమేష్ సినిమా, తరువాత బాబీ సినిమా వుంటుందా అన్నది మాత్రం ఇంకా డిసైడ్ కావాల్సి వుంది.