అభివ్రుధ్ధి వద్దు అంటున్న ఎర్రన్న ?

అభివ్రుధ్ధి చేయండి మహా ప్రభో అని అంతా కోరుతారు. దాని కోసం దీక్షలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు. కానీ ఎర్రన్నలు మాత్రం మాకొద్దీ ప్రగతి అంటున్నారు. విశాఖకు పాలనారాజధాని రాబోతోంది. దానికి తోడు ట్రాఫిక్…

అభివ్రుధ్ధి చేయండి మహా ప్రభో అని అంతా కోరుతారు. దాని కోసం దీక్షలు చేస్తారు, ఉద్యమాలు చేస్తారు. కానీ ఎర్రన్నలు మాత్రం మాకొద్దీ ప్రగతి అంటున్నారు. విశాఖకు పాలనారాజధాని రాబోతోంది. దానికి తోడు ట్రాఫిక్ కూడా బాగా పెరుగుతుంది. ఈ నేపధ్యంలో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మించేందుకు వైసీపీ సర్కార్ జీఎమ్మార్ కు  నిర్మాణ బాధ్యతలు అప్పగించింది.

నిజానికి ఈ ఎయిర్ పోర్టుని గత టీడీపీ సర్కార్ ప్రతిపాదించింది. ఇక ఎటూ పాలనరాజధాని వస్తోంది కదా ని జగన్ సర్కార్ నిర్మాణం చేస్తోంది. భవిష్యత్తులో విశాఖకు ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. దానికి తోడు రాజధాని అయితే రాకపోకలు ఎక్కువవుతాయి.

అటువంటి ఎయిర్ పోర్ట్ వద్దు అనేస్తున్నారు సీపీఎం నేత సీహెచ్ నరసింగరావు. నిజానికి విశాఖలో ప్రస్తుతం ఉన్న ఎయిర్ పోర్ట్ విస్తరణకు అనుకూలంగా లేకపోవడం వల్లనే కొత్త ఎయిర్ పోర్ట్ ని నిర్మించాల్సివస్తోంది. పైగా అది డిఫెన్స్ అవసరాల కోసం తీసుకుంటారని కూడా అంటున్నారు. ఎదుగుతున్న విశాఖ నగరానికి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ అవసరం ఉందని అంతా భావిస్తున్న వేళ వద్దు అని సీపీఎం నేత అనడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో మరి.

బాలయ్య కోసం ఈ కథ రాసుకున్నా

ఆ ముగ్గురు, విధి రాసిన రాత