సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు.. తను ఆ బాధితురాలినంటూ చెప్పింది..మీ టూ అంటే.. మీ టూ అని ప్రకటించుకుంది.. బాలీవుడ్ లో బంధుప్రీతి దానికి తను కూడా బాధితురాలినే అని ప్రకటించుకుంది. మరో వివాదం తలెత్తితే తను కూడా ఆ విషయంలో బాధితురాలేనని అంటోంది. తాజాగా డ్రగ్స్ వ్యవహారంపై చర్చ మొదలు కాగానే.. తను కూడా డ్రగ్స్ బాధితురాలే అని చెప్పుకుంటోంది.
అయితే తను డైరెక్టుగా డ్రగ్స్ తీసుకోలేదట. తన మెంటర్ తనకు డ్రగ్స్ ఇచ్చినట్టుగా, తను మైనర్ గా ఉన్నప్పుడే అలా డ్రగ్స్ బాధితురాలిని అయినట్టుగా కంగనా చెప్పుకొచ్చింది.
విషయం ఏమిటంటే.. ఏ వివాదం తెర మీదకు వచ్చినా అందులో తన అటెండెన్స్ వేయించుకోవడం కంగనాకు అలవాటుగా మారింది! కంగనా వివాదం చేయని అంశాలు దాదాపుగా లేవు!
ఫోర్బ్స్ పత్రిక మీద కంగనా సోదరి ఆ మధ్య దుమ్మెత్తి పోసింది. ఆ తర్వాత వీళ్లు ట్విటర్ మీద అలిగారు. మళ్లీ అదే ట్విటర్ లో ట్వీటేస్తూ ఉంటారు. ఏ వివాదం అయితే ట్రెండింగ్ లో ఉంటుందో.. దాంట్లో వీళ్ల రన్నింగ్ కామెంట్రీ ఉంటుంది. ఎవ్వరినీ మంచి వాళ్లు అని వీరు ఒప్పుకోరు.