సంచయిత గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ట్రస్ట్ చైర్ పర్సన్ హోదాలో ఉండడాన్ని తెలుగుదేశం అసలు తట్టుకోలేకపోతోంది. ఏకంగా చంద్రబాబు, లోకేష్ డైరెక్ట్ గానే రంగంలోకి దిగి సంచయితపైన ఆరోపణలు చేస్తున్న సంగతి విధితమే.
మరో వైపు సంచయిత కూడా గట్టిగానే అటాక్ చేస్తూ బాబును గుక్కతిప్పుకోనీయని వైనమూ తెలిసిందే. ఇపుడు అర్జంటుగా సంచయిత మీద రాళ్ళు వేయాలి. ఆమె హయాం అంతా అవినీతిమయం అని చెప్పాలి. ఇదే టీడీపీ అజెండా.ఏకంగా అధినాయకుడు చంద్రబాబు మీదనే ఆమె బాణాలు వేస్తూండడంతో అటు మాన్సాస్ ట్రస్ట్ మీదనే కాదు, ఇపుడు సింహాచలం ట్రస్ట్ మీద కూడా అనుకూల మీడియా విష ప్రచారానికి తెరతీసింది.
సింహాచలం ట్రస్ట్ నిధులు అక్రమం అవుతున్నాయంటూ విచిత్ర కధనాలు వండి వారుస్తున్నారు. దేవాలయం పవిత్రత గురించి కూడా చెబుతూ ఇన్నాళ్ళు ఆమెకు మతాన్ని అంటగట్టిన వాళ్ళు ఇపుడు అవినీతి, అక్రమాలు అంటూ కొత్త రాగం అందుకుంటున్నారు. మరి దీనికి సంచయిత ధీటుగా ఎలా బదులు ఇస్తుందో చూడాలి.
మొత్తానికి పూసపాటి వారసురాలికి అన్ని రకాలుగా ఇబ్బందులు కలిగించాలని పచ్చ పార్టీ గట్టిగా డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. మరో వైపు ట్రస్టుల మీద లేనిపోని కధనాలు రాస్తున్న వారి మీద, వాటిని పదే పదే వల్లిస్తున్న టీడీపీ పెద్దల మీద లీగల్ యాక్షన్ కి దిగాలని సంచయిత ఆలోచిస్తోందని కూడా అంటున్నారు. చూడాలి మరి.