బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పై సినిమాలు రాబోతున్నాయట. ఇప్పటికే బాలీవుడ్ జనాలు బయోపిక్ ల మీద, వాస్తవ ఘటనల మీద తీవ్రంగా దృష్టి సారించారు. ఏ అవకాశాన్నీ వదులుకోకూడదన్నట్టుగా వారు సినిమాలు తీస్తున్నారు. ఇలాంటి క్రమంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై సినిమాలు తీయడానికి కూడా వారు వెనుకాడటం లేదని స్పష్టం అవుతోంది. ఇప్పటికే కొందరు మూవీ మేకర్లు టైటిళ్లను కూడా రిజిస్టర్ చేయించారట.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్- బయోగ్రఫీ, సుశాంత్, ది అన్ రిసాల్వ్ డ్ మర్డర్ మిస్టరీ-రాజ్ పుత్ .. ఈ పేర్లతో సినిమా టైటిళ్లు రిజిస్టర్ అయ్యాయట. ఇలా సుశాంత్ పై సినిమాలు తీయాలనుకునే వాళ్లు అతడిది హత్య అని కూడా డిక్లేర్డ్ చేసినట్టుగా టైటిళ్లను ఫిక్స్ చేసినట్టున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది హత్య అని ఇప్పటి వరకూ సీబీఐ తేల్చలేదు. అయితే బిహారీలతో సహా కొన్ని రాజకీయ పక్షాల వాళ్లు అతడిది హత్య అని అంటున్నారు. ఈ క్రమంలో ఆ మేరకు సినిమా టైటిల్ కూడా రిజిస్టర్ అయినట్టుగా ఉంది.
ఎంతో సక్సెస్ ఫుల్ వ్యక్తి అయిన మహేంద్రసింగ్ ధోనీ బయోపిక్ లో సుశాంత్ నటించి ఆకట్టుకున్నాడు. అతడి జీవితం విషాదం కాగా.. ఇప్పుడు మరెవరో అతడి మీద సినిమాలు తీస్తామంటున్నారు.