వినాయక చవితి వచ్చిందంటే చాలు బాలీవుడ్ లో అందరి చూపు శిల్పాషెట్టిపై పడుతుంది. ప్రతి ఏటా వినాయక చవితిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రముఖులందర్నీ తన ఇంటికి అహ్వానిస్తుంది. మరి ఈ కరోనా ఏడాది శిల్పాషెట్టి ప్లాన్స్ ఏంటి?
“11 ఏళ్లుగా వినాయకచవితిని ఆర్భాటంగా చేయడం నాకు అలవాటైంది. ఏటా అందర్నీ ఆహ్వానిస్తుంటాను. ఈ ఏడాది కూడా వినాయక చవితిని సెలబ్రేట్ చేస్తాను. ఆల్రెడీ గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చాం. కాకపోతే కరోనా వల్ల ఈ ఏడాది ఎవ్వర్నీ అహ్వానించడం లేదు.”
నిజానికి ఈ వినాయక చవితి తనకు చాలా ప్రత్యేకం అంటోంది శిల్పాషెట్టి. ఈ వినాయకచవితి రోజున సత్యనారాయణ వ్రతం చేసి, తన కూతురుకు అన్నప్రాసన చేయబోతున్నట్టు తెలిపింది. దీని కోసం పూజారిని గడిచిన 13 రోజులుగా హోమ్ క్వారంటైన్ లో ఉంచామని, అతడు తమ ఇంటికొచ్చి పూజలు చేస్తాడని స్పష్టంచేసింది.
ఈసారి కూతురు అన్నప్రాసన వేడుకతో పాటు వినాయకచవితిని పూర్తిగా కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరుపుకుంటామని స్పష్టంచేసింది శిల్పాషెట్టి. కనీసం చెల్లెలు షమితను కూడా పిలవడం లేదని తేల్చేసింది. ఎందుకంటే ఆమె కోల్ కతాలో ఓ షూటింగ్ లో ఉందట.