దీపావళి వీకెండ్‌ని మరోసారి తమిళ అనువాద చిత్రాలకి కట్టబెట్టేసారు తెలుగు నిర్మాతలు. కేవలం దీపావళి వీకెండ్‌లో వచ్చిన తమిళ అనువాద, హిందీ చిత్రాలకే ఇరవై కోట్ల వరకు నెట్ వసూళ్లు వచ్చాయి. తమిళ సూపర్‌స్టార్ విజయ్ చిత్రాలకి మునుపటితో పోలిస్తే ఇక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది. విజిల్ కూడా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుని ఫస్ట్ వీకెండ్‌లోనే సేఫ్ జోన్‌కి దగ్గరగా వెళ్లింది.
వీక్ డేస్‌లో 'విజిల్' సౌండ్ అంతగా వినిపించకపోయినా కానీ, కార్తీ చిత్రం 'ఖైదీ' మాత్రం స్లోగా స్టార్ట్ అయి ఇప్పటికీ స్టడీగా నడుస్తోంది. కార్తీ రీసెంట్ ఫ్లాప్స్ వల్ల ఖైదీ చిత్రాన్ని తక్కువ ధరకే కొన్నారు. మొదటి వారం తిరగకుండానే ఈ చిత్రం లాభాల్లోకి వెళ్లింది. తమిళంలోను ఖైదీ భారీ హిట్ దిశగా వెళుతోంది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రిలీజ్ అవుతుందని కార్తీ ప్రకటించాడు.
దీపావళికి విడుదలైన హిందీ చిత్రాలు మూడూ నిరాశపరిచాయి. హౌస్‌ఫుల్ 4 చిత్రాన్ని క్రిటిక్స్ తూర్పారబట్టారు. రాజ్‌కుమార్ రావు నటించిన 'మేడ్ ఇన్ చైనా'కి కూడా ఆదరణ దక్కలేదు. ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకి 'మీకు మాత్రమే చెప్తా', 'ఆవిరి' అనే చిన్న చిత్రాలు వచ్చాయి.