మళ్లీ మీ టూ… మ్యూజిక్ డైరెక్టర్ కు ఇక్కట్లు!

' Advertisement మీ టూ' వ్యవహారాన్ని జనాలు కాస్త మరిచిపోయారని అంతా ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నారు. అందులో భాగంగా ఒక టీవీ చానల్ వాళ్లు కూడా అదే భావించారు. ఇదివరకూ ఆరోపణలు ఎదుర్కొన్న సినీ…

'

మీ టూ' వ్యవహారాన్ని జనాలు కాస్త మరిచిపోయారని అంతా ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నారు. అందులో భాగంగా ఒక టీవీ చానల్ వాళ్లు కూడా అదే భావించారు. ఇదివరకూ ఆరోపణలు ఎదుర్కొన్న సినీ సెలబ్రిటీని మళ్లీ ఆ టీవీ చానల్ వాళ్లు తెరపైకి తెచ్చారు. అయితే ఆయన విషయంలో మళ్లీ ఒక బాధితురాలు 'మీ టూ' అంటోంది. ఇది బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనూ మాలిక్ విషయంలో. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించిన వ్యక్తి అనూమాలిక్. ఆయన పాట వినని సంగీత ప్రియుడు బహుశా ఉండడు.

జాతీయ అవార్డు గ్రహీత కూడా. అయితే ఈయనపై కొన్నాళ్ల కిందట ఒక సింగర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తెలుగులో కూడా పలు పాటలను పాడిన నేహా ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఇదంతా కొన్నినెలల కిందట జరిగింది. దేశంలో 'మీ టూ' రచ్చ రేగినప్పుడు నేహ ఆ ఆరోపణలు చేసింది.

ఆ ఆరోపణలు వచ్చినప్పుడు ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ కు జడ్జిగా వ్యవహరిస్తున్న అనూమాలిక్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అయితే మధ్యలో మీటూ వేడి తగ్గింది. దీంతో ఆయనకు తిరిగి ఆ బాధ్యతలను అప్పగించారట నిర్వాహకులు. దీనిపై సింగర్ నేహా ఫైర్ అవుతోంది.

ఆయన గతంలో తనతో వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ, అనూ మాలిక్ ను ఒక జంతువుగా అభివర్ణించింది నేహా. ఇలా ఆ సంగీత దర్శకుడిపై రచ్చ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.

ఉత్తుత్తినే ఆరోపణలు చేశామని ఒప్పుకున్నట్లేగా!