టాప్ గేర్ లో ‘ఆది’ ముందుకెళ్లాలి

యంగ్ హీరో ఆది సాయి కుమార్ లేటెస్ట్ సినిమా ‘టాప్ గేర్’. వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ…

యంగ్ హీరో ఆది సాయి కుమార్ లేటెస్ట్ సినిమా ‘టాప్ గేర్’. వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ టాప్ గేర్ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్, సాయి కుమార్, బెక్కం వేణుగోపాల్, యన్ శంకర్, నిర్మాతలు దామోదర ప్రసాద్, అనిల్ సుంకర, రాధా మోహన్, నటుడు డి. యస్. రావు, డైరెక్టర్ శేఖర్ సూరి, సత్తి బాబు, నారాయణ్ గౌడ్, హరీష్, సుదర్శన్ రెడ్డి తదితరులు ముఖ్య అతిదిలుగా పాల్గొన్నారు. 

హీరో సందీప్ కిషన్, డైలాగ్ కింగ్ సాయి కుమార్ టాప్ గేర్ బిగ్ టికెట్ ను లాంచ్ చేశారు అనంతరం డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ.. అందరూ ఈ “టాప్ గేర్” సినిమా ట్రైలర్, టీజర్ బాగుందని మెచ్చుకుంటున్నారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా మా ఆది కి బిగ్ బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. దర్శకుడు శశి , హీరో ఆది నాకు బెస్ట్ ఫ్రెండ్స్. ఈ సినిమాలో ఆది చాలా బాగా నటించాడు.తనకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వడమే కాకుండా ఈ “టాప్ గేర్” సినిమాతో ఆది కేరీర్ బ్రేక్ లేకుండా సాగిపోవాలి. అలాగే రాబోయే 2023 లో ఆది తో నేను ఒక సినిమా తియ్యడానికి ప్లానింగ్ చేస్తున్నాను. ఈ సినిమా పెద్ద విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. దర్శకుడు శశి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను. హీరో, హీరోయిన్స్ ఆది, రియా లిద్దరూ చాలా బాగా నటించారు.ఎన్నో హిట్ చిత్రాలకు కెమెరామెన్‌గా పని చేసిన సాయి శ్రీరామ్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్ ఈ సినిమాకు అందించిన సంగీతం, నేపథ్య సంగీతం హైలెట్ అవ్వనుంది. అందరూ ఫుల్ ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని అన్నారు.

హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. నిర్మాత శ్రీధర్ చాలా పాజిటివిటి ఉన్న వ్యక్తి. సినిమాను ఇంకా బాగా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్ళాలి అనుకునే వ్వక్తి. తను ఇంకా ఇలాంటి సినిమాలు చాలా తియ్యాలి. దర్శకుడు శశి చాలా డెడికేషన్ ఉన్న వ్వక్తి. తను ఈ సినిమాకు చాలా హార్డ్ వర్క్ చేశారు. సాయి శ్రీరామ్ గారి ఫ్రెమింగ్ చాలా బాగుంటుంది. తను నన్ను, రియా ను చాలా బాగా చూపించారు..హర్ష మంచి మ్యూజిక్ ఇచ్చారు. “టాప్ గేర్” సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు శశికాంత్ మాట్లాడుతూ… థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా అన్నీ ఏమోషన్స్ ఉన్న ఇలాంటి మంచి కథ ఉన్న సినిమాకు ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి లభించడమే కాకుండా ఈ సినిమాకు నన్ను సెలెక్ట్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. సాయి శ్రీ రామ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. మా “టాప్ గేర్” సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ రియా, సంగీత దర్శకుడు హర్ష, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి, నిర్మాత రాధామోహన్ తదితరులు ప్రసంగించారు.