కరోనా వేళ అందరూ సామాజిక దూరం పాటించాలనే నియమం ఉంది. అయితే ఓవర్గం మాత్రం సామాజికంగా దగ్గరవుతోంది. తమ చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేసుకుంటోంది. చేసిన తప్పుని కప్పి పుచ్చుకోడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తమ సామాజిక వర్గంలో ఎవరికైనా అన్యాయం జరిగితే మిగతావారంతా ఎదిరించి నిలవొచ్చు, కానీ తమలో ఒకడే అన్యాయం చేస్తే వాడిని క్రమశిక్షణలో పెట్టుకోవాలి. మరోసారి తప్పు జరక్కుండా చూసుకోవాలి. కానీ రమేష్ హాస్పిటల్స్ వ్యవహారంలో సామాజిక రక్షణ కోసం అందరూ ప్రయత్నిస్తున్నారు.
ఇంకెక్కడైనా ఇలాంటి ప్రమాదం జరిగిదే.. ప్రభుత్వంపై, సదరు సంస్థలపై విమర్శలతో విరుచుకుపడే ప్రతిపక్ష నేత చంద్రబాబు నోరు మూసుకున్నారు. ఆ సామాజిక వర్గం మీడియా పూర్తిగా వార్తల్ని తొక్కి పడేసింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏం చేయాలో అంతా చేశాయి. డాక్టర్ రమేష్ బాబు నిప్పు, ప్రభుత్వమే కక్షపూరితంగా వ్యవహరిస్తోందని నిందలేయడానికి కూడా వెనకాడలేదు.
రమేష్ బాబు ఆస్పత్రికి రాయపాటి సాంబశివరావు కుటుంబానికి ఉన్న బంధం బైటపడటంతో..(రాయపాటి కోడలే రమేష్ హాస్పిటల్స్ సీఈవో) పక్కాగా ఇది టీడీపీ వ్యవహారమే అని తేలిపోయింది. అంతే కాదు.. చంద్రబాబు సీన్లో ఉన్నారంటే.. ఆ సామాజిక వర్గం అంతా రక్షణగా ఉన్నట్టే లెక్క. తీరా ఇప్పుడు బంధుగణం రంగంలోకి దిగుతోంది.
హీరో రామ్ తన అంకుల్ కోసం ముసుగు తీసేసి బైటకొచ్చారు. ఏకంగా సీఎం జగన్ ని టార్గెట్ చేసి, కుట్ర జరుగుతోందంటూ పెద్ద సీన్ క్రియేట్ చేయాలని చూశారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఆయన డబుల్ దిమాక్ ఇక్కడ పనిచేయలేదు. ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలనుకుని, తనే పూర్తిగా కార్నర్ అయిపోయాడు రామ్. నెటిజన్లో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
మొత్తమ్మీద రమేష్ హాస్పిటల్స్ వ్యవహారంలో.. ఆ సామాజిక వర్గం పూర్తిగా నిందను మోయాల్సి వస్తోంది. దీనికి కారణం అన్యాయాన్ని కప్పిపుచ్చడానికి అందరూ ఏకం కావడమే. తప్పు జరిగింది, 10 మంది చనిపోయారు. బైటకొచ్చి తప్పు ఒప్పుకుని విచారణరు సహకరించొచ్చుగా. అంత మాత్రానికే రమేష్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రమేష్ బాబు ఎందుకు పారిపోవాలి? ఆయన్ని కాపాడ్డం కోసం ఇలా సామాజిక వర్గమంతా ఎందుకు ఏకం కావాలి?
టీడీపీ దారుణ ఓటమితో ఆ వర్గంలో వచ్చిన అభద్రతా భావమే వారిని ఏకం చేసింది, చివరకు ఏకాకిని చేస్తుంది.