‘మహానటి’తో కీర్తి సురేష్‌కి జాతీయ అవార్డు రావడంతో పాటు నటిగా గౌరవ ప్రతిష్టలు కూడా వచ్చాయి. యంగ్ ఏజ్‌లో అంత బరువైన పాత్ర చేయడంతో ఆ ఇమేజ్‌ని కాపాడుకోవాలని కీర్తి సురేష్ తెలుగులో కమర్షియల్ చిత్రాలు సైన్ చేయలేదు. అయితే మహానటి లాంటి సినిమాలు ఎప్పుడూ రావు. ఆ తరహా పాత్రలే చేయాలని కూర్చుంటే కెరీర్లో గ్రోత్ ఉండదు.
తమిళంలో పెంగ్విన్, తెలుగులో ‘గుడ్‌లక్ సఖి’, ‘మిస్ ఇండియా’ చిత్రాలను కీర్తి సైన్ చేసింది. ప్రెగ్నెంట్ లేడీగా కనిపించిన మిస్టరీ థ్రిల్లర్ ‘పెంగ్విన్’ డిజిటల్‌గా విడుదలయి మెప్పించలేకపోయింది. ‘గుడ్ లక్ సఖి’ చిత్రంలోను ఆమె తండా పిల్లగా డీ గ్లామరైజ్డ్ క్యారెక్టరే చేసింది. ఇది కూడా ఓటిటి ద్వారానే విడుదలవుతోంది. మిస్ ఇండియా చిత్రాన్ని కూడా ఓటిటిలో విడుదల చేయడానికి సన్నాహాల్లో ఉన్నట్టు తెలిసింది.
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు థియేటర్లలో విడుదలయితే తప్ప సదరు హీరోయిన్ క్రేజ్ ఏమిటనేది అర్థం కాదు. రంగ్ దే, సర్కారు వారి పాట నుంచి అయినా మళ్లీ కమర్షియల్ సినిమాలకు కట్టుబడి, ‘మహానటి’ ఇమేజ్‌ని కొనసాగించే ఆలోచన మానుకుంటే మంచిదని ఆమె అభిమానులు సయితం అభిప్రాయపడుతున్నారు.