గూఢచారి 2 వస్తోంది

అడవి శేష్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం గూఢచారి. ఆ సినిమాకు సీక్వెల్ అన్నది ఎప్పటి నుంచో బకాయిగా వుండిపోయింది. మేజర్, హిట్ 2 తరువాత శేష్ ఇప్పుడు ఈ ప్రాజెక్టు మీదకు…

అడవి శేష్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం గూఢచారి. ఆ సినిమాకు సీక్వెల్ అన్నది ఎప్పటి నుంచో బకాయిగా వుండిపోయింది. మేజర్, హిట్ 2 తరువాత శేష్ ఇప్పుడు ఈ ప్రాజెక్టు మీదకు వస్తున్నారు. 

గూఢచారి సినిమా ఓ టిపికల్ స్పై మూవీ. పైగా దానికి మంచి ఎమోషన్లు, ట్విస్ట్ కూడా యాడ్ అయ్యాయి. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే మామూలు విషయం కాదు. కేవలం హీరో క్యారెక్టర్ తీసుకుని మరో కథ రాసుకుని సినిమా అందిస్తారో లేక, పార్ట్ వన్ కు కొనసాగింపుగా స్టార్ట్ చేసి కొత్త కథలోకి వెళ్తారో చూడాల్సి వుంది.

గూఢచారి..క్షణం, మేజర్, హిట్ 2 సినిమాలతో తనకంటూ ఓ జానర్ ను తయారు చేసుకున్నాడు శేష్. అందువల్ల ఈ సీక్వెల్ మీద కూడా మంచి అంచనాలు వుంటాయి. తొలిభాగాన్ని నిర్మించిన పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర నే మలి భాగాన్ని కూడా నిర్మిస్తారు.

హిట్..డిజె టిల్లు..మాదిరిగా గూఢచారి సిరీస్ కు కూడా టాలీవుడ్ లో క్రేజ్ వుంది. ఈ సినిమా తరువాత శేష్ ఓ భారీ సినిమాను అన్నపూర్ణ బ్యానర్ పై విదేశీ కొలాబరేషన్ తో చేస్తారు.