న‌టికే అనుకుంటే చెల్లిని విడిచిపెట్ట‌లేదు

బాలీవుడ్ న‌టి, మాజీ మిస్ ఇండియా న‌టాషాకే అనుకుంటే ఆమె చెల్లిని కూడా క‌రోనా మ‌హమ్మారి విడిచిపెట్ట‌లేదు. ఈ విష‌యాన్ని న‌టాషా సోష‌ల్ మీడియా వేదిక‌గా చెప్పుకొచ్చారు. న‌టి న‌టాషా సూరికి ఇటీవ‌ల క‌రోనా…

బాలీవుడ్ న‌టి, మాజీ మిస్ ఇండియా న‌టాషాకే అనుకుంటే ఆమె చెల్లిని కూడా క‌రోనా మ‌హమ్మారి విడిచిపెట్ట‌లేదు. ఈ విష‌యాన్ని న‌టాషా సోష‌ల్ మీడియా వేదిక‌గా చెప్పుకొచ్చారు. న‌టి న‌టాషా సూరికి ఇటీవ‌ల క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆగ‌స్ట్ ఒక‌టిన ప‌నిపై పూణేకు త‌న‌తో పాటు చెల్లి రూపాలి, బామ్మ వ‌చ్చార‌న్నారు. త‌న‌తో పాటు వారు కూడా అనారోగ్యానికి గుర‌య్యార‌న్నారు.

తాజాగా త‌న చెల్లి రూపాలికి క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయిన‌ట్టు సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారామె. ఈ సంద‌ర్భంగా న‌టి న‌టాషా చెల్లి రూపాలి త‌న‌కు క‌రోనా పాజిటివ్‌పై సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

“నాకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. గత కొన్ని రోజులుగా నాకు జ్వరం , ముక్కుతో పాటు గొంతు సమస్య త‌లెత్తాయి. అలాగే నాలుక రుచి కూడా కోల్పోయినట్టు ఫీలింగ్ క‌లిగింది. వైద్య ప‌రీక్ష‌ల్లో క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. బ్రీతింగ్ ఎక్స‌ర్‌సైజ్‌, యోగా చేస్తున్నాం. కోవిడ్  చాలా డిస్ట‌ర్బ్ చేస్తోంది. పాజిటివ్ మైండ్‌తో ప్రారంభ ద‌శ‌లోనే కోవిడ్‌ను జ‌యించ‌వ‌చ్చ‌ని నేను న‌మ్ముతున్నాను. త్వ‌ర‌లోనే కోలుకుని మీ ముందుకు వ‌స్తాను” అంటూ రూపాలి ఆ పోస్టులో చెప్పుకొచ్చారు. ఈ క‌రోనా మ‌హ‌మ్మారి ఎవ‌ర్నీ విడిచి పెట్టేలా లేదు. 

ప్రయత్నం మంచిదే.. ప్రయాణమే

ఇదీ జగన్ విజన్