ఈసారైనా జాగ్రత్త పడతారా? మలినేని?

బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్ లు ఇచ్చాక, పండగచేస్కో, విన్నర్ సినిమాలతో వెనుక పడిన డైరక్టర్ గోపీచంద్ మలినేని. 2017లో విడుదలైన విన్నర్ తరువాత మళ్లీ ఇప్పటి వరకు సినిమా రాలేదు. ఆఖరికి…

బ్యాక్ టు బ్యాక్ మూడు హిట్ లు ఇచ్చాక, పండగచేస్కో, విన్నర్ సినిమాలతో వెనుక పడిన డైరక్టర్ గోపీచంద్ మలినేని. 2017లో విడుదలైన విన్నర్ తరువాత మళ్లీ ఇప్పటి వరకు సినిమా రాలేదు. ఆఖరికి విన్నర్ తో నష్టపోయిన నిర్మాత టాగోర్ మధునే మళ్లీ సినిమా సెట్ చేసారు. రవితేజతో సినిమా అనౌన్స్ అయింది.

విన్నర్ సినిమా సమయంలో ఆది నుంచి స్క్రిప్ట్ మీద తన జడ్జిమెంట్ తనదిగా ముందుకు వెళ్లారు గోపీచంద్ మలినేని. నిర్మాత కూడా ఫాలో ఫాలో అన్నారు. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసింది. ఇప్పుడు మరి స్క్రిప్ట్ ఏమిటో? ఎలావస్తోందో అన్నది మళ్లీ ఆ ఇద్దరికే తెలియాలి.

అయితే రవితేజ సినిమాకు గోపీచంద్ మలినేని ఈసారి ఎమోషనల్ డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్ తో జతకట్టడం విశేషం. వాస్తవానికి గోపీచంద్ ది ఎంటర్ టైన్ మెంట్ వ్యవహారం. కామెడీ ఫుల్ గా పండించే టైపు. కానీ బుర్రా సాయిమాధవ్ అక్కడే పరమ వీక్.

గతంలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 కానీ, మొన్నటి మొన్న వచ్చిన రాజుగారి గది-3 కానీ బుర్రాకు కామెడీ రైటింగ్ లో వున్న వీక్ నెస్ ను బయటపెడతాయి. ఖైదీలో ఆలీ-బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కానీ, రాజుగారి గది-3లో అజయ్ ఘోష్ కామెడీ ట్రాక్ కానీ చూస్తే, అలాంటివి గోపీచంద్ మలినేని సినిమాకు, రవితేజకు సెట్ అయ్యేవికాదు.

గోపీచంద్ కామెడీ వ్యవహారాలు చూసుకుని, ఎమోషనల్ వ్యవహారాలు బుర్రాకు అప్పగించారేమో మరి? తెలియదు. ఏమైనా ఈసారి అయినా నిర్మాత టాగోర్ మధు జాగ్రత్తగా వుండడం అవసరం. ఇప్పటికే ఆయన చాలా దెబ్బలుతిన్నారు. స్క్రిప్ట్  పెర్ ఫెక్ట్ గా చూసుకోవడం చాలా అవసరం. 

మెగా హీరోపై డైరెక్టర్ ఫన్నీ కామెంట్స్.. సరదా ఇంటర్వ్యూ