బహుశా మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కు ఇదే తొలిరాజకీయ సమావేశం కాబోలు. అయితే ఇందులో రాజకీయం ఏమీ లేదని అంటున్నారు. ఇద్దరు మహిళా మణులు సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భార్యతో స్టార్ హీరో మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని సీఎం గృహంలో ఈ సమావేశం జరిగింది.
ఒకప్పటి హీరోయిన్ అయిన నమ్రత ప్రస్తుతం మహేశ్ బాబు సంబంధిత కార్యక్రమాలను సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్ బాబు దత్తత తీసుకున్న గ్రామం పనులను కూడా నమ్రత పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ విషయాలను వివరించారట ఆమె. ముఖ్యమంత్రి భార్యతో సమావేశం అయ్యి, అందుకు సహకారం కోరినట్టుగా సమాచారం.
ఇక సినిమా వాళ్లు వైఎస్ జగన్ కు దూరదూరంగానే ఉంటున్నారనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా మెగాస్టార్ చిరంజీవి వెళ్లి సతీసమేతంగా కలిశారు. ఇప్పుడు మహేశ్ బాబు సతీమణి వెళ్లి సీఎం సతీమణితో సమావేశం కావడం గమనార్హం.