విశాఖ విభజన ఏపీలో పెద్ద సిటీ. ఈ సిటీకే తలమానికం లాంటి ఫ్లై ఓవర్ నిర్మాణం జరుపుతుంది. 110 కోట్ల రూపాయల ఖర్చుతో జాతీయ రహదారి మీద యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం అయిన ఫ్లై ఓవర్ ని విశాఖ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగమోహనరెడ్డి ఈ నెల 23న అంకితం చేయనున్నారు. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఢిల్లీ నుంచి ఇంజనీర్లు వచ్చి అత్యుత్తమ నైపుణ్యంతో తీర్చి దిద్దారు.
విశాఖ నుంచి రాజమండ్రీ వైపు వెళ్లాలంటే చాలు ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అంతే కాదు సిటీని ఆనుకుని అన్ని వైపులకూ కదలాలన్నా ఎన్ ఏడీ కూడలి కీలకం. అటువంటి చోట ఫ్లై ఓవర్ ని నిర్మించడం ద్వారా విశాఖలోని పాతిక లక్షమ మంది ప్రజల కష్టాలను వైసీపీ సర్కార్ తీర్చింది.
ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడం విశాఖకు మరింత శోభను ఇస్తుంది. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ టూర్ లో అందమైన వుడా పార్కుని కూడా ప్రారంభించి నగరానికి టూరిజం హబ్ గా కొత్త కాంతులు అందనున్నారు.
మొత్తానికి సీఎం టూర్ కోసం విశాఖ ముస్తాబైంది. విశాఖ రాక సందర్భంగా జగన్ మరెన్ని వరాలు ఇస్తారో అని నగర వాసులతో పాటు, వైసీపీ నేతలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.