వర్మ అంటే ఆర్జీవీ అని అనుకోవద్దు..ఈ వర్మవేరు.. డైరక్టర్ ప్రశాంత్ వర్మ. కరోనా నేపథ్యంలో ఓ సినిమాను ప్రకటించారు ఈయన. ఆ సినిమా టైటిల్ జాంబిరెడ్డి. అదిగో అక్కడే రెడ్డి సామాజిక వర్గ మనోభావాలు దెబ్బతిన్నట్లు బోగట్టా. అయితే అలా అని చెప్పి బాహాటంగా నిరసన వ్యక్తం చేయలేదు. కానీ ప్రశాంత్ వర్మకు, ఆయన కుటుంబీకులకు నేరుగా ఫోన్ చేసి, ఓ లెక్కలో వేసుకుంటున్నారని బోగట్టా.
మరే పేరు దొరకలేదా? జాంబిరెడ్డి ఏంటి బాబూ అని నిలదీస్తున్నారట. సినిమా కర్నూలు బ్యాక్ డ్రాప్ లో, కరోనా విజృంభణ నేఫథ్యంలో వుంటుంది. కథలో జాంబిరెడ్డి క్యారెక్టర్ పాజిటివ్ నే అంటూ నచ్చ చెబుతున్నా వినడం లేదట. దీంతో ఇప్పుడు ప్రశాంత్ వర్మ వివరణ ఇచ్చుకునే పనిలో పడ్డారు. తొలి జాంబి మూవీ ఇది అని, అందుకే జాంబిరెడ్డి అని టైటిల్ పెట్టా అన్నది ఆయన వెర్షన్.