మోడీ సర్కార్‌ది మొండిపట్టుదల!

కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభించడానికి అవసరమైన ఒప్పందం చేసుకునే విషయంలో మోడీ సర్కార్ మొండిపట్టుదలకు వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇలాంటి ఏర్పాటు భద్రత పరంగా దేశానికి ఇబ్బందికరం అని ప్రభుత్వం భావిస్తే గనుక.. స్పష్టంగా ఆ విషయాన్ని…

కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభించడానికి అవసరమైన ఒప్పందం చేసుకునే విషయంలో మోడీ సర్కార్ మొండిపట్టుదలకు వెళ్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇలాంటి ఏర్పాటు భద్రత పరంగా దేశానికి ఇబ్బందికరం అని ప్రభుత్వం భావిస్తే గనుక.. స్పష్టంగా ఆ విషయాన్ని ప్రకటించి.. ఆ ఆలోచన ఇప్పటికి లేదని తేల్చేయవచ్చు. కానీ అలా కాకుండా.. పాకిస్తాన్ వసూలు చేయదలచుకున్న రుసుము గురించి పట్టుపట్టి.. వారు దానిని రద్దు చేయలేదనే మిష చూపించి.. ఒప్పందం కాలదన్నుకుంటే మాత్రం.. అది మొండితనమే.

పాకిస్తాన్ లో ఉన్న కర్తార్ పూర్ గురుద్వారాతో భారతదేశంలోని సిక్కులకు కూడా ఎంతో ఆధ్యాత్మిక అనుబంధం ఉంది. తిరుమల, కాశీ, మక్కా, జెరూసలెం తరహాలోనే సిక్కులు కర్తార్‌పూర్ ను భావిస్తారు. జీవితకాలంలో ఒకసారైనా సందర్శించాలని అనుకుంటారు. భారత్ లోని డేరేబాబా నానక్ నుంచి పాకిస్తాన్ కర్తార్ పూర్ లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ ను ఈ కారిడార్ కలుపుతుంది. దీనివలన భారత యాత్రికులు వీసా లేకుండా వెళ్లి రావడం సాధ్యం అవుతుంది.

అయితే భారత యాత్రికులకు వీసా అవసరం లేకపోయినప్పటికీ.. ఒక్కొక్కరికి 20 డాలర్ల వంతున ప్రవేశ రుసుము వసూలు చేయాలని పాక్ నిర్ణయించింది. ఈ రుసుమును ఎత్తివేయాలని భారత్ కోరుతోంది. నిజానికి ఈ కారిడార్ ద్వారా రాకపోకలు వచ్చేనెల 9నుంచి ప్రారంభం కావాలనేది షెడ్యూలు. బుధవారం రోజు (అక్టోబరు 23) దీనికి సంబంధించిన ఒప్పందం జరగాల్సి ఉంది. ప్రవేశ రుసుము తగ్గించే ప్రతిపాదనపై పాక్ స్పందించలేదు. దీంతో అసలు ఒప్పందమే జరగకపోవచ్చునని.. కారిడార్ ద్వారా రాకపోకాలు మొదులుకాకపోవచ్చునని సంకేతాలు వస్తున్నాయి.

ప్రవేశ రుసుము విషయంలో భారత్ పంతానికి పోతున్నదనే అభిప్రాయం కలుగుతోంది. ఈ రోజుల్లో.. చాలా ఆలయాల్లో స్పెషల్ దర్శనాల టికెట్లు 1500 రూపాయలు మించిపోతున్నాయి. పాకిస్తాన్ అంతకంటె తక్కువగానే భారతీయులకు ప్రవేశ రుసుము పెట్టింది. దానికోసం పట్టుపడితే.. అక్కడి గురుద్వారాను సందర్శించాలనుకునే భారతీయ సిఖ్ ల మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని పలువురు భావిస్తున్నారు.

జగన్ పై జేసీ కోపం.. రీజన్ అదే!