బాబు ఎగస్ట్రాలకు కూడా ఓ లిమిటుండాలి

కిందపడినా తనదే పైచేయి అనే బాపతు నాయకుల్లో చంద్రబాబునాయుడు ముందు వరుసలో ఉంటారు. రాష్ట్రం మొత్తం ఛీకొట్టి కేవలం 23 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితం చేసినా సరే.. జనం నవ్వుకుంటారనే వెరపు కూడా లేకుండా..…

కిందపడినా తనదే పైచేయి అనే బాపతు నాయకుల్లో చంద్రబాబునాయుడు ముందు వరుసలో ఉంటారు. రాష్ట్రం మొత్తం ఛీకొట్టి కేవలం 23 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితం చేసినా సరే.. జనం నవ్వుకుంటారనే వెరపు కూడా లేకుండా.. ప్రజలందరూ తాను ఓడిపోయినందుకు ఏడుస్తున్నారంటూ పెయిడ్ డ్రామాలు నడిపించిన నాయకుడు చంద్రబాబు. అలాంటి నేత.. ఇప్పుడు.. రాజధాని మీద ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సమయంలో చాలా అతిశయోక్తుల్లాంటి డైలాగులు వల్లిస్తున్నారు.

అమరావతిలో రాజధానిని ఎంతమేరకు కొనసాగించాలనే విషయంలో జగన్మోహన రెడ్డి ప్రభుత్వం పునరాలోచన చేస్తున్న సంగతి నిజమే కావొచ్చు గాక. కానీ.. అది రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సమతుల్యంగా ఉండడానికి జరుగుతున్న ప్రయత్నం మాత్రమే. అధికార వికేంద్రీకరణ కోసం.. కొన్ని కేంద్రాలను ఇతర ప్రాంతాలకు మార్చడం మాత్రమే. ఆ విషయం కూడా ఇంకా ఇదమిత్థంగా తేలలేదు. అయితే చంద్రబాబు మాత్రం.. తనకు కీర్తి వచ్చేస్తుందనే భయంతో జగన్ సర్కారు అమరావతిని పొట్టన పెట్టుకుంటున్నారంటే.. తెగ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.

తాను అభివృద్ధి చేసిన హైదరాబాద్ ను తర్వాత వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ కూడా కంటిన్యూ చేశారని గప్పాలు కొట్టుకుంటున్నారు. అక్కడేమో హైదరాబాదులో అభివృద్ధికి చంద్రబాబుకు సంబంధమే లేదన్నట్లుగా.. ఆ రాష్ట్ర ప్రజలు పూర్తిగా ఆ పార్టీని నేలమట్టానికి పతనం చేసేశారు. హైదరాబాదు జంట నగరాల్లో తెలుగుదేశం ఒక్క సీటు కూడా గెలవలేదు. అభివృద్ధి ముసుగులో చంద్రబాబు సమస్తమూ హైదరాబాదులోనే కేంద్రీకరించడం అనే ఒకే ఒక్క పాపం వల్ల.. విభజన తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వనరులకు దిక్కులేని అనాథ రాష్ట్రంగా ఉన్నదనే మాట వాస్తవం.

తీరా అక్కడ చంద్రబాబు జ్ఞాపకం ఎంత మిగిలిందో అందరికీ తెలుసు. అలాంటిది.. అమరావతిలో కేవలం డిజైన్లు గీయించినందుకు.. డిజైన్ల పేరిట కోట్ల రూపాయలు తగలేసినందుకు.. తానేదో రాజధాని నగర సృష్టికర్త అన్నంత పేరు వచ్చేస్తుందని.. ఆ కీర్తిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడని చంద్రబాబు చెప్పుకోవడం.. ఆయననే నవ్వులపాలు చేసేలా ఉంది.

జగన్ పై జేసీ కోపం.. రీజన్ అదే!