ఈ కవరింగ్ కరెక్టేనా ‘సాక్షి?

''..ఏపీ సమస్యలపై తాను ఇతర శాఖల మంత్రులతో మాట్లాడతానని అమిత్‌షా హామీనిచ్చారు. ఆ తర్వాతనే మంత్రులను కలవాలని ఆయన సీఎం జగన్‌కు సూచించారు. దాంతో మంత్రులతో భేటీ వాయిదా పడింది…'' ఇదీ సాక్షి మీడియాలో…

''..ఏపీ సమస్యలపై తాను ఇతర శాఖల మంత్రులతో మాట్లాడతానని అమిత్‌షా హామీనిచ్చారు. ఆ తర్వాతనే మంత్రులను కలవాలని ఆయన సీఎం జగన్‌కు సూచించారు. దాంతో మంత్రులతో భేటీ వాయిదా పడింది…'' ఇదీ సాక్షి మీడియాలో వార్త.

కానీ అంతకు ముందే, మంత్రులు సిఎమ్ జగన్ తో అపాయింట్ మెంట్ లు క్యాన్సిల్ చేసుకున్నారని, అమిత్ షాతో కూడా నామ్ కే వాస్తే సమావేశం జరిగిందని, ఈ విషయమై విజయసాయి రెడ్డిపై జగన్ గరం గరంగా వున్నారని వార్తలు వచ్చేసాయి.

ఇంతకీ ఏది నిజం? మంత్రులకు ఇచ్చిన అపాయింట్ మెంట్ లు క్యాన్సిల్ చేసుకున్నది వాస్తవం. ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారన్నది మాత్రం ఆ మంత్రులకు, వారి ఆఫీసు సిబ్బందికే తెలియాలి. అక్కడి నుంచి సరైన సమాచారం సేకరించి సాక్షి అందించి వుంటే బాగుండేది.

అలా కాకుండా అమిత్ షా తనే మంత్రులతో మాట్లాడతానని, ఆ తరువాత మంత్రులను కలవాలని సూచించారని అనడం కాస్త మిస్ మ్యాచ్ గా వుంది. కొంచెం తేడా కొడుతోంది. ఏ హోమ్ మంత్రి కావచ్చు, పార్టీ నేత కావచ్చు ఇలా అంటారా? గతంలో ఇలాంటి సందర్భాలు వున్నాయా? అన్నది అనుమానం.

సాక్షి ఇలా చెప్పే కన్నా, అసలు రీజన్ కనుక్కుని చెప్పడం లేదా, అప్పటికే వచ్చిన వార్తలు కరెక్ట్ అయివుంటే, ఈ విషయం మీద సైలంట్ గా వుండడం చేస్తే బాగుండేదేమో?

జగన్ పై జేసీ కోపం.. రీజన్ అదే!