బాస్ పార్టీకి పోటీగా ‘మా బావ మనోభావాలు’

సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్నాయి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు. చిరంజీవి, బాలయ్య నటించిన ఈ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా ఉన్నాయి. అలా స్పెషల్ సాంగ్స్ తో కూడా ఈ రెండు సినిమాలు…

సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్నాయి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు. చిరంజీవి, బాలయ్య నటించిన ఈ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా ఉన్నాయి. అలా స్పెషల్ సాంగ్స్ తో కూడా ఈ రెండు సినిమాలు పోటీపడబోతున్నాయి.

వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఇప్పటికే స్పెషల్ సాంగ్ వచ్చేసింది. బాస్ పార్టీ పేరిట రిలీజైన ఆ పాట యూట్యూబ్ ను ఓ ఊపు ఊపేసింది. మరి వీరసింహారెడ్డి సంగతేంటి? అక్కడికే వస్తున్నాం..

వీరసింహారెడ్డి సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉంది. చిరంజీవి స్పెషల్ సాంగ్ కు బాస్ పార్టీ అని పేరు పెడితే, బాలయ్య స్పెషల్ సాంగ్ కు “మా బావ మనోభావాలు” అనే పేరు పెట్టారు. క్రిస్మస్ కానుకగా ఈ లిరికల్ వీడియోను 24వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. 

బాస్ పార్టీలో ఊర్వశి రౌథేలా చిందేసింది. లిరికల్ వీడియోలో ఆమె అందాలు అక్కడక్కడ కనిపించాయి. ఇక “మా బావ మనోభావాలు” పాటలో చంద్రిక రవి మెరుపులు మెరిపించనుంది. 2-3 తమిళ సినిమాల్లో ఈమె నటించింది. ఇండియాలో పుట్టి, ఆస్ట్రేలియాలో పెరిగిన ఈ బ్యూటీ, తన అందచందాలతో ఈ పాటకు ఓ కిక్కు తీసుకురాబోతోంది.

మొత్తమ్మీద సంక్రాంతికి రాబోతున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు.. ఇలా స్పెషల్ సాంగ్స్ తో కూడా పోటీపడబోతున్నాయి. ఈ ఒక్క విషయంలో దేవిశ్రీ, తమన్ మధ్య ఎవరిది పైచేయి అనే విషయం రిలీజ్ కు ముందే తేలిపోనుంది.