‘బీజేపీలోకి టీడీపీ విలీనానికి ఓకే!’

తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీలోకి విలీనం చేసుకోవడానికి రెడీ అని ప్రకటించారు ఆ పార్టీ నేతలు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల పొత్తు ఉండే ప్రసక్తి లేదని కమలం పార్టీ నేతలు…

తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీలోకి విలీనం చేసుకోవడానికి రెడీ అని ప్రకటించారు ఆ పార్టీ నేతలు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల పొత్తు ఉండే ప్రసక్తి లేదని కమలం పార్టీ నేతలు ప్రకటించారు. బీజేపీ  రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, బీజేపీ ఏపీ విభాగం అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతూ చంద్రబాబు మీద తీవ్రంగా ధ్వజమెత్తారు.

'ఇంకా ఏ మొహం పెట్టుకుని  చంద్రబాబు నాయుడు తమ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు?'' అని వారు ప్రశ్నించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడకు కాంగ్రెస్ నేత కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి పట్టిన  గతే పడుతుందన్నారు. చంద్రబాబు నాయుడుకు జైలు భయం తీవ్రంగా ఉందన్నారు. 

అవినీతి పరులను వదిలేది లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించగానే చంద్రబాబు నాయుడులో భయం మొదలైందని, అందుకే బీజేపీతో పొత్తు అంశాన్ని తెర మీదకు తీసుకవచ్చారాయన అన్నారు. అయితే  చంద్రబాబుకు  అంత అవకాశం లేదన్నారు. 

గతంలో భారతీయ జనతా పార్టీ- టీడీపీల పొత్తుతో చంద్రబాబు నాయుడుకు లబ్ధి కలిగిందే కానీ, బీజేపీకి ఎలాంటి ఉపయోగం కలగలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యం అని అంటున్నారని, అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తామంటూ కమలం పార్టీ నేతలు ప్రకటించుకున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలతోనే తమ పార్టీ బలోపేతం అవుతుందన్నారు.