బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కూడా కరోనా నుంచి కోలుకున్నాడు. తనకు తాజాగా నిర్వహించిన టెస్టుల్లో నెగెటివ్ వచ్చినట్టు ఈ నటుడు స్వయంగా ప్రకటించాడు.
“మాటంటే మాటే. ఈరోజు మధ్యాహ్నం పరీక్షల్లో కరోనా నెగెటివ్ వచ్చింది. దీన్ని ఎదుర్కొంటానని నేను మీకు ముందే చెప్పాను. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించిన మీ అందరికీ
ధన్యవాదాలు. నానావతి హాస్పిటల్ వైద్యులకు, నర్సింగ్ స్టాఫ్ కు మనస్ఫూర్తిగా కృజ్ఞతలు చెబుతున్నాను.”
ఇలా తను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న విషయాన్ని వెల్లడించాడు అభిషేక్ బచ్చన్. కొన్ని రోజుల కిందట ఇదే హాస్పిటల్ నుంచి అమితాబ్ బచ్చన్ డిశ్చార్జ్ అయ్యారు. ఆ టైమ్ లో అందరికీ థ్యాంక్స్ చెప్పిన బిగ్ బి, తన కొడుకు ఇంకా హాస్పిటల్ లో ఉన్నందుకు బాధను వ్యక్తంచేశారు.
అంతకంటే ముందు ఐశ్వర్యరాయ్, కూతురు ఆరాధ్య కూడా కరోనా పాజిటివ్ తో ఇదే హాస్పిటల్ చేరి, తొందరగానే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా అభిషేక్ బచ్చన్ కూడా కోలుకోవడంతో.. బచ్చన్ కుటుంబం మొత్తం కరోనా నుంచి పూర్తిగా బయటపడినట్టయింది.