ప్రమాణస్వీకారానికి కోటిన్నర ఖర్చు

పదవి వచ్చిన ఆనందం అలా వుంటుంది. మరో మెట్టు ఎక్కాలంటే ఈ అవకాశాన్ని వాడుకోవాలన్న ఉత్సాహం అలా వుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా నియమితులయ్యారు సినిమా నిర్మాత దాసరి కిరణ్…

పదవి వచ్చిన ఆనందం అలా వుంటుంది. మరో మెట్టు ఎక్కాలంటే ఈ అవకాశాన్ని వాడుకోవాలన్న ఉత్సాహం అలా వుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా నియమితులయ్యారు సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్. పాలకమండలిలో ఖాళీ అయిన ఓ సభ్యుని స్థానంలో ఆయనను నియమించారు సిఎమ్ జగన్. సోమవారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారానికి దాసరి కిరణ్ కుమార్ చేస్తున్న ఖర్చు అక్షరాలా కోటిన్నర అన్నది విళ్వసనీయ వర్గాల బోగట్టా. ఇందులో మేజర్ ఖర్చు మీడియా ప్రకటనలకే. వివిధ దినపత్రికలు, ఛానెళ్లు వీటన్నింటికి సోమవారం నాడు విరివిగా ప్రకటనలు ఇచ్చారు. అలాగే తన అనుచరులను, తన వారిని తిరుపతి తీసుకెళ్తున్నారు. ఇలా అన్నింటికీ కలిపి అవుతున్న ఖర్చు కోటిన్నర అన్నమాట.

నిజానికి టిటిడి పాలకమండలి సభ్యత్వం అన్నది ఓ గౌరవ ప్రదమైన పదవి. చాలా మంది బడా బాబులు కోరుకునే పదవి. ఆదాయమార్గం ఎంత మాత్రం కాదు. పైగా దాసరి కిరణ్ కుమార్ పదవీ కాలం ఫుల్ లెంగ్త్ కాదు. మళ్లీ నియమితులైతే అది వేరే సంగతి. కానీ దీన్ని ఓ మెట్టుగా మార్చుకుని రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు కిరణ్ కుమార్. అందుకే ఈ హంగామా..ప్రకటనల హడావుడి. కోటిన్నర ఖర్చు.