చంద్రబాబు మతి భ్రమణం సంపూర్ణం

అమరావతి అంశాన్ని పట్టుకుని వేలాడుతూ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్న చంద్రబాబు అసలు విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. అమరావతితో మొదలుపెట్టి ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా అంటూ లెక్కలు తీస్తున్నారు. 48 గంటల డెడ్…

అమరావతి అంశాన్ని పట్టుకుని వేలాడుతూ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్న చంద్రబాబు అసలు విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. అమరావతితో మొదలుపెట్టి ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా అంటూ లెక్కలు తీస్తున్నారు. 48 గంటల డెడ్ లైన్ తర్వాత రెండోసారి జూమ్ లో నెటిజన్ల ముందుకొచ్చిన చంద్రబాబు ప్రసంగం పూర్తిగా గతి, మతి తప్పింది.

అమరావతి ఎందుకు ఏకైక రాజధానిగా ఉండాలనే విషయాన్ని పదే పదే రుజువు చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడటంతో చంద్రబాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అధికశాతం జనాభా పట్టణాల్లోనే ఉందని అందుకే పట్టణాలను అభివృద్ధి చేసే ఉద్దేశంతో అమరావతి నిర్మాణానికి పూనుకున్నానని అన్నారాయన. ఇలా పల్లెటూళ్లను పట్టించుకోకపోవడం వల్లే, రైతులను విస్మరించడం వల్లే చంద్రబాబుకి పదేళ్ల పాటు అధికారం దూరమైంది.

రాష్ట్ర విభజన తర్వాత “అనుభవం” అనే ఏకైక ప్రాతిపదికన ముఖ్యమంత్రి అయ్యారే కానీ, ఆయనపై ప్రజలకు నమ్మకం ఉండి కాదు. అయినా సరే ఆయన ఆలోచనా ధోరణి మారలేదు. ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికాను ఉదాహరణలు చెబుతూ 2050కి భారత్ లో కూడా 50శాతం జనాభా పట్టణాలకు తరలిపోతుందని చెప్పుకొచ్చారు.

అయితే ఆయన చెప్పిన ఉదాహరణలకు అమరావతి నిర్మాణానికి ఎక్కడా పొంతన లేదు. అమరావతి ఆగిపోతే ఆదాయం రాదంటూ చెత్త లాజిక్ చెప్పారు బాబు. అదే సమయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి వస్తున్న వ్యతిరేకతను కాచుకునే ప్రయత్నమూ చేశారు. విశాఖకు తన హయాంలోనే అత్యథిక పెట్టుబడులు వచ్చాయని, రాయలసీమ ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన చేసింది తానేనని చెప్పుకున్నారు.

హైదరాబాద్ రూపశిల్పిని తానేనంటూ మరోసారి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ నిర్మించేటప్పుడు తనకి ఏ కులమూ లేదని, అమరావతి విషయానికొచ్చే సరికి తనకు కులాన్ని అంటగడుతున్నారని వాపోయారు.

అమరావతి పరిసర ప్రాంతాల్లో ఎవరు ఎంతెంత భూములు కొన్నారో అసెంబ్లీలో రిజిస్ట్రేషన్ నెంబర్లతో సహా మంత్రి బుగ్గన, చంద్రబాబు పరువు తీసిన తర్వాత కూడా ఇంత నిస్సిగ్గుగా తనకి కులం లేదని చెప్పుకోవడం బాబుకే చెల్లింది.

మొత్తమ్మీద వరుస ప్రెస్ మీట్లతో విసిగిస్తున్న “జూమ్ బాబు” మరోసారి అమరావతి కోసం నెటిజన్ల ముందుకొచ్చి అభాసుపాలయ్యారు.

నయనతార రేటు 9 కోట్లా