ఈ మాటలేంటి మోడీజీ!

ఎన్నికలంటూ వస్తే ప్రధాని నరేంద్రమోడీలో కొత్త రూపాన్ని చూస్తూ ఉంటారు జనాలు. ఒక్కోసారి ఆశ్చర్యపోయే మార్పులను ఆయన చూపించేస్తూ ఉంటారు. ఎన్నికలు లేని సమయాల్లో కూడా మోడీ మాటలు ఒక్కోసారి కాస్త ఆలోచన పరులకు…

ఎన్నికలంటూ వస్తే ప్రధాని నరేంద్రమోడీలో కొత్త రూపాన్ని చూస్తూ ఉంటారు జనాలు. ఒక్కోసారి ఆశ్చర్యపోయే మార్పులను ఆయన చూపించేస్తూ ఉంటారు. ఎన్నికలు లేని సమయాల్లో కూడా మోడీ మాటలు ఒక్కోసారి కాస్త ఆలోచన పరులకు విడ్డూరంగా ఉంటాయి. గత ఐదేళ్లలోనే భారతదేశం పరువు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిందని ప్రకటించుకోవడం మోడీకే చెల్లింది. తాజాగా హంగర్ ఇండెక్స్ లో ఇండియా దారుణమైన స్థితిలో నిలిచింది. ఆఖరికి పాకిస్తాన్, శ్రీలంకలు కూడా మనకైనా మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. మరి ఇలాంటి ఫీట్స్ కు ఏమంటారు? అంతా కాంగ్రెస్ పార్టీ వల్లనే అంటారు కాబోలు మోడీ భక్తులు.

మంచి ఏదైనా ఉంటే అది మోడీ వల్ల, చెడు అనుకుంటే దానికి కారణమంతా యాభై యేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలన. ఇదే దేశంలో ఇప్పుడు సాగుతున్న థియరీ. ఆ సంగతలా ఉంటే.. మహారాష్ట్ర, హర్యానాల్లో మోడీ- బీజేపీ ఎన్నికల ప్రచారం మాటలు బహు వింతగా తోస్తున్నాయి. హర్యానాలోనేమో.. ఆర్టికల్ థ్రీ  సెవెన్టీ గురించి మోడీ మాట్లాడారు. అది హర్యానాకు సంబంధించిన వ్యవహారం కాదు. అంతే కాదు. విపక్షాలకు దమ్ముంటే ఆ ఆర్టికల్ ను తిరిగి తీసుకొస్తామని ప్రకటించాలట!

ఇక మహారాష్ట్రలో కమలం పార్టీ ప్రచార పర్వంలో చాలా కామెడీలే ఉన్నాయి. అందులో ఒక కామెడీ ఏమిటంటే.. మహారాష్ట్రలో తమ పార్టీని గెలిపిస్తే వీర సావర్కర్ కు భారతరత్నను ప్రకటిస్తారట. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందనే విషయాన్ని మరిచిపోయి ఇలా మాట్లాడుతూ ఉన్నారా? అసలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకూ, సావర్కర్ కు భారతరత్నగా ప్రకటించడానికి సంబంధం ఏమిటి? మహారాష్ట్రలో గెలిపిస్తే ఆయనకు భారతరత్న అంటూ బీజేపీ బేరానికి దిగింది!

ఆఖరికి తమ సిద్ధాంత కర్త, తమ ఆరాధ్యుడు అయిన సావర్కర్ విషయంలో బీజేపీ ఇలాంటి బేరాలకు దిగడం గమనార్హం! అలాగే అంబేద్కర్ కు భారతరత్న ఇద్దామనుకుంటే కాంగ్రెస్ అడ్డుపడిందని మోడీ అంటున్నారు! అయినా మీరు అనుకుంటే రాత్రికి రాత్రి  మారకంలోని నోట్లనే రద్దే చేశారు. వంద కోట్ల మంది పై జనాభాను ముప్పుతిప్పలు పెట్టారు. అలాంటిది మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీ అడ్డు పడుతోందని.. మాట్లాడటానికి మించిన విడ్డూరం ఏముంటుందని సామాన్య ప్రజానీకం మోడీజీ గురించి అనుకుంటున్నారు!

నీ తెలుగు కంటే నేనే మేలు.. హాట్ యాంకర్ డైరెక్టర్ చిట్ చాట్